సీక్రెట్‌గా హైపర్ సోనిక్ మిస్సైల్‌ను పరీక్షించిన అమెరికా
వాషింగ్టన్: లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీ తయారు చేసిన హైపర్సోనిక్ మిస్సైల్‌ను అమెరికా పరీక్షించింది. హైపర్సోనిక్ ఎయిర్ బ్రీతింగ్ వెపన్ కాన్సెప్ట్(హెచ్ఏడబ్ల్యూసీ) ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ పరీక్ష జరిగింది. అయితే రష్యాను రెచ్చగొట్టవద్దు అన్న ఉద్దేశంతో బైడెన్ సర్కార్ ఆ పరీక్షను రహస్యంగా చేపట్టినట్లు తెలుస్తోంది. పశ్చిమ తీరంలో బీ-52 బాంబర్ నుంచి స్క్రామ్‌జెట్ మిస్సైల్‌ను పరీక్షించారు. సుమారు 65 వేల అడుగుల ఎత్తులో ఆ క్షిపణి ట్రావెల్ చేసింది. దాదాపు 480 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు భావిస్తున్నారు. అయితే ఎంత స్పీడ్‌తో ఆ ప్రొజెక్టైల్ వెళ్లిందో చెప్పలేదు. కనీసం మాక్-5 స్థాయిలో, అంటే ధ్వని వేగం కన్నా అయిదు రెట్ల అధిక వేగంతో ఆ క్షిపణి ప్రయాణించి ఉంటుందని భావిస్తున్నారు. మార్చి నెలలో ఈ పరీక్ష జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఉక్రెయిన్ సంక్షోభం వల్ల ఐసీబీఎం పరీక్షలను కూడా అమెరికా రద్దు చేసినట్లు తెలుస్తోంది. రష్యా వద్ద కింజాల్, సిర్కాన్ హైపర్ సోనిక్ మిస్సైళ్లు ఉన్న విషయం తెలిసిందే. కానీ హైపర్ సోనిక్ వెపన్స్ విషయంలో రష్యా, చైనా కన్నా అమెరికా వెనుకబడి ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

