వాషింగ్టన్, మే 20 : పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం మూడో నెలలో కూడా కొనసాగుతున్నా, ఇప్పట్లో దీనికి తెరపడే అవకాశాలు కన్పించడం లేదు. కాగా, ఫిబ్రవరి 28న ఇరాన్‌పై యూఎస్-ఇజ్రాయెల్ దాడితో ప్రారంభమైన ఈ యుద్ధంలో ఇప్పటికే ఇరాన్‌కు పెను నష్టం వాటిల్లింది.
అదే సమయంలో అగ్రరాజ్యం అమెరికాకు కూడా తీవ్ర నష్టం జరిగింది. ఫైటర్ జెట్లు, డ్రోన్లు సహా 42 విమానాలను అమెరికా కోల్పోయినట్టు కాంగ్రెస్సనల్ రీసెర్చి సర్వీస్ (సీఆర్ఎస్) నివేదిక తెలిపింది. రెండు దేశాల దాడులతో తీవ్రంగా నష్టపోయిన ఇరాన్ ఇప్పటికీ తన స్థాయిలో ప్రతిఘటిస్తూనే ఉంది.