Donald Trump | విమాన ఖర్చులు ఇస్తాం.. అమెరికా నుంచి వెళ్లిపోండి.. అక్రమ వలసదారులకు ట్రంప్ ఆఫర్
అక్రమ వలసదారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ఆఫర్ ఇచ్చారు. స్వచ్ఛందంగా దేశం వీడాలనుకొనే వారికి విమాన టికెట్లు కొనిస్తాం, ఖర్చులకు కొంత డబ్బు కూడా ఇస్తామని ప్రకటించారు. మంగళవారం ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అమెరికాలో అక్రమ వలసదారులకు స్వచ్ఛందంగా దేశాన్ని వీడే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు చెప్పారు.
Donald Trump | వాషింగ్టన్: అక్రమ వలసదారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ఆఫర్ ఇచ్చారు. స్వచ్ఛందంగా దేశం వీడాలనుకొనే వారికి విమాన టికెట్లు కొనిస్తాం, ఖర్చులకు కొంత డబ్బు కూడా ఇస్తామని ప్రకటించారు. మంగళవారం ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అమెరికాలో అక్రమ వలసదారులకు స్వచ్ఛందంగా దేశాన్ని వీడే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు చెప్పారు. దీనిలో భాగంగా అలా వెళ్లేవారికి విమాన చార్జీలతో పాటు ఖర్చులకు కొంత మొత్తం ఇస్తామని చెప్పారు.
వారు మంచిగా ఉంటే, మేము వారిని తిరిగి దేశానికి తీసుకురావాలనుకుంటే, వీలైనంత త్వరగా వారిని దేశంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తామని, భవిష్యత్లో వారితో కలిసి పనిచేస్తామని ట్రంప్ తెలిపారు. హోటళ్లు, పొలాలకు అవసరమైన కార్మికులను పొందడంలో సహాయం చేయాలనుకుంటున్నానని, అవసరమైన ఆ స్థానాలను భర్తీ చేయడానికి సిఫార్సు చేయాలనుకుంటున్నానని ఆయన చెప్పారు. ఇప్పుడు స్వచ్ఛందంగా వెళ్లిపోయిన వారే తమ దేశానికి అవసరమైనప్పుడు అధికారికంగా దేశంలోకి రావచ్చునని ట్రంప్ పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

