ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండించిన జో బైడెన్
Joe Biden | ఉక్రెయిన్‌పై రష్యా దాడులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఖండించారు. అన్యాయమైన దాడులతో ఉక్రెయిన్ ప్రజలను బాధపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉక్రెయిన్‌లో పరిణామాలకు రష్యా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రష్యా దాడులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఖండించారు. అన్యాయమైన దాడులతో ఉక్రెయిన్ ప్రజలను బాధపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉక్రెయిన్‌లో పరిణామాలకు రష్యా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ ఆపరేషన్ ప్రారంభించిన నేపథ్యంలో ఆయన మాట్లాడారు. రష్యా దాడికి ప్రతిచర్య తప్పదన్నారు.
ముందస్తుగా నిర్ణయించుకునే పుతిన్ యుద్ధానికి దిగారని చెప్పారు. ఇది తీవ్రమైన విపత్తు, మానవాళి నష్టానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా, ఉక్రెయిన్ పరిణామాలను గమనిస్తున్నామని చెప్పారు. శుక్రవారం జీ-7 దేశాలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నాటో కూటమికి సహకరిస్తామని తెలిపారు.
ఉక్రెయిన్‌పై మిలిటరీ ఆరేషన్ చేపట్టినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఉక్రెయిన్ సైన్యం తన ఆయుధాలను విడనాడాలని, వేర్పాటు వాదులు లొంగిపోవాలని సూచించారు. ఉక్రెయిన్ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. జోక్యం చేసుకునేవారిపై ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశారు. వేర్పాటువాద ప్రాంతాల్లో పౌరులను రక్షించడానికే ఇది చేస్తున్నట్లు ప్రకటించారు. ఏదైనా రక్తపాతం జరిగితే దానికి ఉక్రెయిన్ పాలకులే బాధ్యతవహించాల్సి ఉంటుందన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

