Marco Rubio | ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. మాకు సంబంధం లేదన్న అమెరికా
రాన్‌పై ఇజ్రాయెల్ (Israel Iran War) ముందస్తు దాడులకు పాల్పడింది. అణు కర్మాగారాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా టెహ్రాన్‌పై వైమానిక దాడులు చేసింది. దీంతో ఆ దేశ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్స్ అధిపతి హుస్సేన్ సలామీతోపాటు పలువురు అణు శాస్త్రవేత్తలు మృతిచెందారు.
వాషింగ్టన్: ఇరాన్‌పై ఇజ్రాయెల్ (Israel Iran War) ముందస్తు దాడులకు పాల్పడింది. అణు కర్మాగారాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా టెహ్రాన్‌పై వైమానిక దాడులు చేసింది. దీంతో ఆ దేశ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్స్ అధిపతి హుస్సేన్ సలామీతోపాటు పలువురు అణు శాస్త్రవేత్తలు మృతిచెందారు. ‘అది అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం కావచ్చు. మా సైనిక కుటుంబాలను, దౌత్య సిబ్బందిని అక్కడి నుంచి తరలిస్తున్నాం. ఆ ప్రాంతాన్ని వీడాలని ఇప్పటికే నోటీసులు ఇచ్చాం. ఇకపై ఏం జరుగుతుందో చూడాలి’ అంటూ పశ్చిమాసియాను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన కొన్ని గంటల వ్యవధిలోనే టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ వైమానికి దాడులకు దిగడం గమనార్హం. అయితే ఈ దాడులకు తమకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా ప్రకటించింది. తమ ప్రమేయం లేకుండానే ఇజ్రాయెల్ దాడులు చేసిందని అగ్రరాజ్యం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio) ప్రకటన విడుదల చేశారు.
ఇరాన్‌పై ఇజ్రాయెల్ (Israel) ఏకపక్ష చర్యలకు దిగిందని రూబియో అన్నారు. ఈ దాడుల్లో అమెరికా ప్రమేయం లేదని తెలిపారు. ‘ఆ ప్రాంతంలోని అమెరికన్ దళాలను కాపాడుకోవడమే తమ తొలి ప్రాధాన్యత. దీనికి సంబంధించి ఇప్పటికే తాము చర్యలు తీసుకున్నాం. ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్‌కు స్పష్టంగా ఒకటి చెప్పాలనుకుంటున్నా. అమెరికా ప్రయోజనాలను గాని, సిబ్బందిని గాని లక్ష్యంగా చేసుకోకూడదని చెప్పారు.
— Secretary Marco Rubio (@SecRubio) June 13, 2025
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

