Kamala Harris Vs Donald Trump | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మారుతున్న సమీకరణాలు..! ట్రంప్‌ను వెనక్కి నెట్టిన కమలా హారిస్..!
Kamala Harris Vs Donald Trump | అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్ 5న జరుగనున్నాయి. రిపబ్లిక్ పార్టీ తరఫున మరోసారి డోనాల్డ్ ట్రంప్ బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
Kamala Harris Vs Donald Trump | అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్ 5న జరుగనున్నాయి. రిపబ్లిక్ పార్టీ తరఫున మరోసారి డోనాల్డ్ ట్రంప్ బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో డెమొక్రాట్ అభ్యర్థిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మార్గం సుగమమైంది. కమలా హారిస్ బరిలో నిలుస్తుండడంతో ఎన్నికల్లో గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. తాజాగా ఓ సర్వే కీలక రిపోర్ట్ విడుదల చేసింది. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కంటే కమలా హారిస్‌కే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ఐపీఎస్ఓఎస్ నేషనల్ పోల్స్ ప్రకారం.. ట్రంప్ కంటే కమలా హారిస్ ముందంజలో నిలిచారు.
బైడెన్ అధ్యక్ష ఎన్నికల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన అనంతరం సోమ, మంగళవారాల్లో ఈ పోల్ జరిగింది. ఆదివారం బిడైన్ ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. జూన్ 27న డోనాల్డ్ ట్రంప్‌తో జరిగిన చర్చల తర్వాత బైడెన్ పోటీ నుంచి తప్పుకోవాలని సొంత పార్టీ నేతల నుంచే డిమాండ్లు వినిపించాయి. తాజాగా నిర్వహించిన సర్వేలో డోనాల్డ్ ట్రంప్‌కు 42శాతం మంది మద్దతు తెలుపగా.. కమలా హారిస్‌కు 44 మందిశాతం అండగా నిలిచారు. దాంతో డెమోక్రటిక్ అభ్యర్థిత్వానికి అవసరమైన మద్దతును కూడగుడుతన్న సమయంలో సర్వేలో ఉపాధ్యక్షురాలికి అనుకూలంగా సర్వే ఫలితం వచ్చింది. ఇంతకు ముందు ఈ నెల 15-16 మధ్య జరిగి సర్వేలో ట్రంప్ 44శాతం.. జులై 1-2 మధ్య జరిగిన సర్వేలో డోనాల్డ్ ఒకశాతం పాయింట్లతో ముందంజలో నిలిచారు.
ప్రస్తుతం కమలా హారిస్ మద్దతు పెరుగుతోందని జాతీయ సర్వేలు చెబుతున్నాయి. పోల్స్టర్ టోనీ ఫాబ్రిజియో మాట్లాడుతూ హారిస్ ప్రజాదరణ పెరగడం కొంతకాలం పాటు కొనసాగుతుందని చెప్పారు. ఇటీవల నిర్వహించిన జాతీయ సర్వేల్లో 56శాతం మంది ఓటర్లు కమలా హ్యారిస్ అభ్యర్థిత్వంపై ఆసక్తి చూపించారు. మానసికంగా ధృడంగా ఉండగలరని.. సవాళ్లను ఎదుర్కోగల సామర్థ్యం ఆమెకు ఉందని అమెరికన్లు భావిస్తున్నారు. అయితే, 78 నుంచి 49శాతం మంది ఓటర్లు ట్రంప్‌పై సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కేవలం 22శాతం మంది మాత్రమే బిడైన్కు ఇదే అభిప్రాయాన్ని ఉందని తెలిపారు.
పీబీఎస్ న్యూస్ సర్వే ప్రకారం.. మొత్తం అమెరికన్లలో 87 శాతం మంది ఎన్నికల రేసు నుంచి తప్పుకోవాలని బిడెన్ తీసుకున్న నిర్ణయం సరైందేనని భావించారు. 41 శాతం మంది బిడెన్ నిర్ణయంతో నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో డెమొక్రాట్ల గెలుపు అవకాశాలను పెంచుతుందని అంచనా వేస్తున్నారు. ఇక ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అధ్యక్ష అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. అధ్యక్ష అభ్యర్థికి కావాల్సిన 1,976 కంటే ఎక్కువగానే ప్రతినిధులు ఆమెకు మద్దతును ప్రకటించారు. ఇటీవల డెలావెర్‌లో ప్రచార ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. బిడైన్ ప్రచార బృందంతో భేటీ అయ్యారు. అదేబృందంతో కలిసి పని చేయనున్నట్లు ప్రకటించారు. ఎన్నికలకు సమయం మూడునెలలే ఉందని.. గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డోనాల్డ్ ట్రంప్‌పై మండిపడ్డారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

