శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 01, 2020 , 12:32:43

యుద్ధ‌నౌక‌లో 4000 మంది.. కాపాడాల‌ని కెప్టెన్ అభ్య‌ర్థ‌న‌

యుద్ధ‌నౌక‌లో 4000 మంది.. కాపాడాల‌ని కెప్టెన్ అభ్య‌ర్థ‌న‌

హైద‌రాబాద్‌: అమెరికాకు చెందిన యుద్ధ నౌక థియోడ‌ర్ రూజ్‌వెల్ట్ ప‌రిస్థితి ఆగ‌మ్య‌గోచ‌రంగా ఉన్న‌ది. ఆ నౌక‌లో ఉన్న 4000 మంది క‌రోనా కాటుకు బ‌ల‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి.  షిప్‌లో ఉన్న సుమారు 100 మంది సిబ్బందికి ఇప్ప‌టికే క‌రోనా పాజిటివ్ తేలింద‌ని, వెంట‌నే త‌మ‌ను ర‌క్షించాలంటూ దాని కెప్టెన్‌.. పెంట్‌గాన్‌కు లేఖ రాశారు. ప్ర‌స్తుతం ఈ షిప్‌ను గువామ్‌లో డాకింగ్ చేశారు.  ఇప్పుడు మేమేమీ యుద్ధం చేయ‌డం లేద‌ని, నావికులు ప్రాణాలు కోల్పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని పెంట‌గాన్‌కు రాసిన లేఖ‌లో కెప్టెన్ బ్రెట్ క్రోజ‌ర్ తెలిపారు.  నేవీ యుద్ధ‌నౌక‌లో ఉన్న ప్ర‌తి ఒక్క‌ర్నీ క్వారెంటైన్ చేయాల‌ని ఆయ‌న వేడుకున్నారు.  వైర‌స్ సోకిన వారిని షిప్‌లో ఐసోలేట్ చేయ‌డం ఇబ్బందిగా ఉంద‌న్నారు. న్యూక్లియ‌ర్ ఎయిర్‌క్రాప్ట్ కేరియ‌ర్ అయిన థియోడ‌ర్ రూజ్‌వెల్ట్ నౌక చాలా సంక్షిష్ట ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్న‌ట్లు కెప్టెన్ చెప్పారు.   


logo