వాషింగ్టన్: ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా సైన్యానికి సంబంధించి 81 విమానాలు, డ్రోన్లు, హెలికాప్టర్లు ధ్వంసమవడమో లేదా తీవ్రంగా దెబ్బతినడమో జరిగిందని కాంగ్రెషనల్ రిసెర్చ్ సర్వీస్(సీఆర్ఎస్) తాజా నివేదిక వెల్లడించింది. న్యూయార్క్ పోస్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ నష్టాల విలువ దాదాపు 3.3 బిలియన్ డాలర్లు(రూ.27,500 కోట్లు) వరకు ఉంటుందని అంచనా. అమెరికా సైన్యానికి చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలు, కీలకమైన నిఘా వ్యవస్థలు, గగనతలంలో ఇంధనం నింపే విమానాలతో పాటు భారీ సంఖ్యలో డ్రోన్లు దెబ్బతినడం వల్ల పశ్చిమాసియాలో అమెరికా వైమానిక కార్యాచరణ సామర్థ్యం తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నది. యుద్ధ విమానాల విభాగంలో అమెరికా మొత్తం 12 ఎఫ్-15 ఈస్ట్రైక్ ఈగిల్ ఫైటర్ జెట్లను నష్టపోయింది.