చల్లారని పశ్చిమాసియా
పశ్చిమాసియాలో 8వ రోజు కూడా దాడులు కొనసాగాయి. జోర్డాన్‌లో అమెరికా దళాలపై శనివారం ఇరాన్ చేసిన దాడికి ప్రతీకారంగా ఇరాన్ లక్ష్యాలపై విరుచుకుపడినట్టు యూఎస్ మిలిటరీ ఆదివారం ప్రకటించింది.
- ఇరాన్‌పై అమెరికా సైన్యం ప్రతీకార దాడులు
- అణు విద్యుత్ కేంద్రంపై దాడి చేశారన్న ఇరాన్
- అవగాహన ఒప్పందాన్ని పాటించబోమంటూ ప్రకటన
- డోంట్ కేర్ అన్న ట్రంప్
దుబాయ్, జూలై 19: పశ్చిమాసియాలో 8వ రోజు కూడా దాడులు కొనసాగాయి. జోర్డాన్‌లో అమెరికా దళాలపై శనివారం ఇరాన్ చేసిన దాడికి ప్రతీకారంగా ఇరాన్ లక్ష్యాలపై విరుచుకుపడినట్టు యూఎస్ మిలిటరీ ఆదివారం ప్రకటించింది. ఈ మేరకు యూఎస్ సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటన చేస్తూ ఇరాన్ సైనిక కోస్తా నిఘా, వాయు రక్షణ వ్యవస్థలు, క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలపై దాడులు చేసినట్టు తెలిపింది. ఈ దాడిని ఇరాన్ అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ ఖండించింది. ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని ఆరోపించింది. ఈ దాడిపై అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ) స్పందించింది. తమ సంస్థ సభ్యులు గతంలో ఆ కేంద్రాన్ని సందర్శించినప్పుడు, అది నిర్మాణ దశలో ఉందని అందులో ఎలాంటి అణు పదార్థాలు లేవని తెలిపింది.
ఇరాన్ నిర్ణయాన్ని ఏ మాత్రం పట్టించుకోను: ట్రంప్
అమెరికా-ఇరాన్ అవగాహన ఒప్పందం (ఎంవోయూ)ను పాటించడం మానేయాలన్న ఇరాన్ నిర్ణయాన్ని తానే మాత్రం పట్టించుకోనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య ఫిబ్రవరి 28న ప్రారంభించిన యుద్ధాన్ని నిలిపివేయాలని రెండు దేశాలు గత నెలలో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. వచ్చే 60 రోజుల్లో తుది ఒప్పందం కుదుర్చుకోవడానికి అంగీకరించాయి. అయితే దానిని ఉల్లంఘించి ఇరు దేశాల పరస్పర దాడులతో ఆ ఎంవోయూకి తూట్లు పడింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Donald Trump
- iran
- US Military
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

