వాషింగ్టన్: ఆ దేశాలకు వెళ్తున్నారా.. అయితే జాగ్రత్త. అక్కడికి వెళ్లకుండా ఉంటేనే మంచిదని అమెరికా తన పౌరులను హెచ్చరించింది. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న శ్రీలంక, జమైకా, బ్రూనై దేశాలకు ప్రయాణాలు పెట్టుకోకూడదని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (USCDCP) వెల్లడించింది. ఆ దేశాలకు ‘లెవల్ 4: వెరీ హై’ కేటగిరీలో చేర్చింది. అదేవిధంగా ఆస్ట్రేలియాకు కూడా వీలైనంత దూరంగా ఉండాలని సూచించింది. ఆ దేశాన్ని ‘Level 1: Low’ నుంచి ‘Level 2: Moderate’ జాబితాలో చేర్చింది.
ఇక నెదర్లాండ్స్, మాల్టా, గునియా, యూఏఈపై ఇప్పటివరకు ఉన్న ‘లెవల్ 4: వెరీ హై కేటగిరీని లెవల్ ౩: హైకి’ తగ్గించింది. అయితే ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోని అమెరికన్లు ఈ దేశాలకు వెళ్లకూడదని తెలిపింది. కరోనా కేసులు అధికంగా ఉన్న దేశాలకు వెళ్లకూడదని, అక్కడ ఉన్న తీవ్రతను బట్టి ఆయా దేశాలకు సీడీసీ వివిధ స్థాయిల్లో ర్యాకింగ్ కేటాయిస్తుంది. సుమారు 200 దేశాల్లో 80 గమ్యస్థానాలు లెవల్ 4 దేశాల జాబితాలో ఉన్నాయి.