US Jobs | అమెరికా ఉద్యోగాలు.. అమెరికా కార్మికులకే.. వర్క్ వీసాలపై వచ్చే వారం కీలక నిర్ణయం?
US Jobs | విదేశీ కార్మికుల వీసా నిబంధనల అమలును మరింత కఠినతరం చేసేందుకు ట్రంప్ యంత్రాంగం సిద్ధమవుతోందని అమెరికా కార్మికశాఖ ఇన్స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి ఎస్పోసిటో స్పష్టం చేశారు.
US Jobs | వాషింగ్టన్ డీసీ: విదేశీ కార్మికుల వీసా నిబంధనల అమలును మరింత కఠినతరం చేసేందుకు ట్రంప్ యంత్రాంగం సిద్ధమవుతోందని అమెరికా కార్మికశాఖ ఇన్స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి ఎస్పోసిటో స్పష్టం చేశారు. విదేశీ ఉద్యోగుల నియామకాలపై తనిఖీలను వేగవంతం చేస్తున్న తరుణంలో ఈ వారంలో అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయని ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు. అమెరికా ఉద్యోగాలు.. అమెరికా కార్మికులకే అని తెలిపిన ఆయన ఫలానా కంపెనీలు, లేదా నిర్దిష్ట వీసా ప్రోగ్రామ్ పేర్లను వెల్లడించలేదు.
కాగా అమెరికన్ కార్మికులను తొలగించి, వారి స్థానంలో తక్కువ వేతనాలకే లభించే విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు పలు కంపెనీలు హెచ్-1బీ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ వ్యవహారం దేశ ప్రజలను మోసం చేయడమేనని, అందుకే హెచ్-1బీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసినా తాను సమర్థిస్తానని వ్యాఖ్యానించారు. కాగా సెప్టెంబర్ 18న జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆదేశాల ప్రకారం విదేశీ ఉద్యోగులను స్పాన్సర్ చేసే కంపెనీలు గతంలో అమెరికన్ ఉద్యోగులను తొలగించాయా లేదా అనే దానిపై విదేశాంగ, కార్మిక, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ శాఖలు సంయుక్తంగా విచారణ చేపట్టనున్నాయి. అలాగే గతంలో దాఖలు చేసిన కార్మిక దరఖాస్తులపై కూడా ఆడిట్ నిర్వహించనున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
LuLu Mall | కూకట్పల్లి లూలూ మాల్లో దీపావళి షాపింగ్ సందడి షురూ.. బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు..!
పలు పంచాయతీల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
బెల్టుషాపుల నియంత్రణకు నాగినేనిప్రోలు రెడ్డిపాలెం పంచాయతీ తీర్మానం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

