Corona Positive | మరోసారి కరోనా బారిన పడిన అమెరికా ఆరోగ్య మంత్రి
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఆ దేశ హెల్త్ సెక్రటరీ జేవియర్ బెకెర్రా మరోసారి కరోనా బారిన పడ్డారు. గత నెల బెర్లిన్ పర్యటనకు వెళ్లిన సమయంలో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో చికిత్స తీసుకుంటూ క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. ఆయనకు మరోసారి కరోనా సోకినట్లు తాజాగా వెల్లడైంది.
కాలిఫోర్నియా, లాస్ ఏంజెలిస్‌లో ఇటీవల జరిగిన కాంట్రవర్షియల్ సమావేశం ‘సమిట్ ఆఫ్ ది అమెరికాస్’లో పాల్గొన్నారు. దీన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ నిర్వహించారు. ఆ తర్వాత శాక్రమెంటోలో బెకెర్రాకు చేసిన యాంటీజెన్ టెస్టులో ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. అయితే వీళ్లిద్దరికీ కూడా బెకెర్రా క్లోజ్ కాంటాక్ట్ కాదని, కావున వారికి కరోనా సోకిందనే భయం అక్కర్లేదని ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు.
అలాగే బెకెర్రా రెండు డోసుల కరోనా వ్యాక్సిన్‌తోపాటు బూస్టర్ డోస్ కూడా తీసుకున్నారని, ప్రస్తుతం ఆయనలో చాలా మైల్డ్ కరోనా లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని ఆరోగ్య శాఖ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతానికి బెకెర్రా ఐసోలేషన్‌లో ఉన్నారని, అక్కడి నుంచే తన బాధ్యతలు నిర్వర్తిస్తారని సమాచారం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

