Fake AI Robo Calls | ఏఐ బేస్డ్ నకిలీ రోబో కాల్స్‌పై అమెరికా నిషేధం.. ఎందుకో తెలుసా..?!
Fake AI Robo Calls | ‘ఏఐ ఆధారిత వాయిస్ రోబో కాల్స్’పై నిషేధాజ్ఞలు విధించినట్లు’ అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ తెలిపింది.
Fake AI Robo Calls | ‘డీప్ ఫేక్’ ప్రభావం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పైనే పడింది. ఆయన వాయిస్’ను అనుకరిస్తూ కొందరు మోసగాళ్లు ఆర్టిఫిషియల్ బేస్డ్ ఫోన్ కాల్స్ సృష్టించి తప్పుడు ప్రచారం ప్రారంభించారు. దీంతో అమెరికా ప్రభుత్వం అప్రమత్తమైంది. ‘ఏఐ ఆధారిత వాయిస్ రోబో కాల్స్’పై నిషేధాజ్ఞలు విధించినట్లు అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ తెలిపింది.
‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సాయంతో కొందరు నేరగాళ్లు ఫేస్ వాయిస్ రోబో కాల్స్ సృష్టిస్తున్నారు. వాటితో ప్రముఖుల కుటుంబాలను బెదిరించడం, ప్రముఖుల వాయిస్ ఇమిటేట్ చేసి తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తున్నారు. గతంలోనూ ఈ తరహా ఆడియో, వీడియో కాల్స్ సృష్టించినా ప్రస్తుత ఆధునిక టెక్నాలజీతో ఈ నకిలీ వాయిస్ రోబో కాల్స్ గుర్తించడం కష్టసాధ్యంగా మారింది. ప్రస్తుతం దేశాధ్యక్ష ఎన్నికల సీజన్లో ఈ తరహా ఫేక్ రోబో కాల్స్ కొత్త ముప్పుకు దారి తీస్తున్నాయి’ అని ఎఫ్‌సీసీ కమిషనర్ జియోఫ్రే స్టార్క్స్ చెప్పారు.
దీంతో తక్షణం ఏఐ బేస్డ్ రోబోకాల్స్ ను బ్యాన్ చేస్తున్నట్లు ఎఫ్‌సీసీ కమిషనర్ జియోఫ్రే స్టార్క్స్ తెలిపారు. ఈ ఫేక్ వాయిస్ రోబోకాల్స్ సృష్టించినా, ప్రసారం చేసినా భారీ జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. ఇటీవల న్యూ హ్యాంప్ షైర్ లో జరిగిన డెమోక్రాట్ ప్రైమరీ ఎన్నిక విషయంలో బైడెన్ ను అనుకరిస్తూ నకిలీ రోబో కాల్స్ వచ్చాయి. దేశాధ్యక్ష ఎన్నికల్లో తనకు ఓటేయొద్దని ఆ కాల్స్ లో చెప్పినట్లు కలకలం చెలరేగింది. ఈ నేపథ్యంలో దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

