ఉక్రెయిన్‌కు కొత్తగా 350 మిలియన్ డాలర్ల సైనిక పరికరాలు… ప్రకటించిన అమెరికా
వాషింగ్టన్: రష్యా దురాక్రమణను ఉక్రెయిన్ ఎదుర్కొనేందుకు పలు దేశాలు మద్దతు ఇస్తున్నాయి. నేరుగా కదన రంగంలోకి దిగకపోయినా పరోక్షంగా సహకారం అందిస్తున్నాయి. ఇప్పటికే ఫ్రాన్స్‌తోపాటు పలు దేశాలు ఆయుధాలను పంపిస్తున్నట్లు ప్రకటించాయి. తాజాగా ఉక్రెయిన్‌కు అమెరికా కొత్తగా సహాయం ప్రకటించింది. రష్యాను ఎదుర్కొనేందుకు అదనంగా 350 మిలియన్ డాలర్ల (సుమారు రూ.2,627 కోట్లు) విలువైన సైనిక పరికరాలను అందిస్తామని ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ శనివారం తెలిపారు. నేల, నింగితోపాటు ఇతర దాడుల ముప్పును ఉక్రెయిన్ ఎదుర్కొనేందుకు మూడో ప్యాకేజీ కింద అత్యాధునిక రక్షణ పరికరాలను అందజేస్తామని చెప్పారు.
రష్యా అన్యాయ యుద్ధంపై ఉక్రెయిన్ పోరాడేందుకు ఇది సహాయపడుతుందని ఆంటోనీ బ్లింకెన్ ఆశాభావం వ్యక్తం చేశారు. రష్యా దాడి ముప్పు నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్లో తొలుత 200 మిలియన్ డాలర్ల సైనిక సహకారం, రష్యా బలగాల మోహరింపు నేపథ్యంలో 60 మిలియన్ డాలర్ల సైనిక పరికరాలను ఉక్రెయిన్‌కు అమెరికా అందించినట్లు ఆయన చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

