ChatGPT | చాట్‌జీపీటీని బ్యాన్ చేసిన యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్..కాలేజీల్లో ఏఐ టూల్స్‌పై నిషేధం
ChatGPT | బెంగళూర్ యూనివర్సిటీ, న్యూయార్క్ ఎడ్యుకేషన్ బోర్డు బాటలోనే చైనా కేంద్రంగా పనిచేసే యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ (హెచ్‌కేయూ) కాలేజీల్లో ఏఐ టూల్స్ వాడకాన్ని నిషేధించింది.
ChatGPT | బీజింగ్ : బెంగళూర్ యూనివర్సిటీ, న్యూయార్క్ ఎడ్యుకేషన్ బోర్డు బాటలోనే చైనా కేంద్రంగా పనిచేసే యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ (హెచ్‌కేయూ) కాలేజీల్లో ఏఐ టూల్స్ వాడకాన్ని నిషేధించింది. హెచ్‌కేయూ విద్యార్ధులు, టీచర్లు ఓపెన్ ఏఐ ఆధారిత చాట్‌జీపీటీని వాడరాదని వర్సిటీ స్పష్టం చేసింది. అసైన్మెంట్స్ రాయడంలో చాట్‌బాట్‌ను ఉపయోగించడం అక్రమమని, బోధనకు కూడా దీన్ని ఉపయోగించడం నిబంధనలకు విరుద్ధమని హెచ్‌కేయూ ఓ ప్రకటనలో పేర్కొంది.
చాట్‌జీపీటీపై నిషేధాన్ని ఉల్లంఘిస్తూ దాన్ని ఎవరైనా వాడుతూ విద్యార్ధులు పట్టుబడితే వారిపై డేటా చౌర్యం నేరాల కింద కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించింది. చాట్‌జీపీటీ, ఇతర ఏఐ టూల్స్‌ను నిషేధించామని టీచర్లు, విద్యార్ధులకు హెఛ్కేయూ టీచింగ్ పర్సన్ ఇన్చార్జ్ హె లిరెన్ ఈమెయిల్స్ పంపారని గిజ్చైనా వెల్లడించింది. క్లాస్, అసైన్మెంట్స్, అసెస్‌మెంట్స్‌లో చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్‌ను అనుమతించబోమని, టీచర్ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఈ టూల్స్‌ను విద్యార్ధులు ఎవరైనా ఉపయోగిస్తే మోసం, డేటా చౌర్యం అభియోగాలపై చర్యలు చేపడతామని ఈ మెయిల్ స్పష్టం చేసింది.
చాట్‌జీపీటీని వాడే విద్యార్ధులు ఇబ్బందుల్లో పడతారని ఈ మెయిల్లో హె లిరెన్ హెచ్చరించారు. ఇక భారత్‌లో బెంగళూర్ కేంద్రంగా పనిచేసే ఆర్వీ యూనివర్సిటీ కాలేజీల్లో చాట్‌జీపీటీని బ్యాన్ చేసింది. చాట్‌జీపీటీతో పాటు గిట్‌హబ్, కో-పైలట్, బ్లాక్ బాక్స్ వంటి ఇతర ఏఐ ఆధారిత టూల్స్‌ను వర్సిటీ నిషేధించింది. పరీక్షల్లో లేదా అసైన్మెంట్స్ పూర్తిచేయడంలో చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్ వాడకాన్ని నిషేధిస్తూ తాము యూనివర్సిటీలోని అన్ని విభాగాలకు మార్గదర్శకాలు జారీ చేశామని వర్సిటీ ప్రతినిధి వెల్లడించారు.
Read More :
Pay Cuts | మాస్ లేఆఫ్స్‌కు బదులు ఎడాపెడా వేతన కోతలు..!
Ex-Googlers Company | గూగుల్ జాబ్ తీసేస్తే.. పోటీగా మరో ఆరుగురితో కొత్త కంపెనీ మొదలుపెట్టాడు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

