ఇస్లామాబాద్ : (Pakistan) పాకిస్తాన్లో నిరుద్యోగం గరిష్ట స్థాయికి చేరుకున్నది. కరోనా వ్యాప్తి సమయంలో దాదాపు 2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. ముందే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటం, నిరుద్యోగం పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ నిరుద్యోగిత రేటు 16 శాతం దాటిందని పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ ఎకనామిక్స్ (పీఐడీఈ) కొత్త గణాంకాలను బట్టి తెలుస్తున్నది. ప్రస్తుతం చదువుకున్న యువతలో 24 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు. ఇటీవల పాకిస్తాన్ కోర్టులో ఒక్క ప్యూన్ పోస్ట్ కోసం దరఖాస్తులు కోరగా.. 15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, దరఖాస్తు చేసుకున్న వారిలో ఎంఫిల్ చేసిన వ్యక్తులు కూడా ఉన్నారని పాకిస్తాన్ వార్తాపత్రిక డాన్ ఒక కథనాన్ని ప్రచురించింది.
పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ ఎకనామిక్స్ తన సర్వే వివరాలను సెనేట్ స్టాండింగ్ కమిటీకి వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం దేశంలో 40 శాతం గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగా ఉన్నారు. ఎంఫిల్‌లో చదివిన వారు కూడా చాలా మంది ఉన్నారు. వీరిని కూడా గణాంకాల్లో చేర్చినట్లయితే నిరుద్యోగిత రేటు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. లాక్ డౌన్ కారణంగా దాదాపు 2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని, ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో కార్మికులు ఉన్న దేశాల్లో పాకిస్థాన్ 9 వ స్థానంలో ఉన్నదని ఎకనామిక్ సర్వే నివేదిక పేర్కొన్నది.
పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (పీబీఎస్) సర్వే ప్రకారం, దేశంలో నిరుద్యోగ రేటు 2017-18లో 5.8 శాతం నుంచి 2018-19లో 6.9 శాతానికి పెరిగింది. ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వంలో ఒక ఏడాదిలోనే నిరుద్యోగం రేటు వేగంగా పెరిగింది. పురుషుల నిరుద్యోగ రేటు 5.1 నుంచి 5.9 శాతానికి, మహిళా నిరుద్యోగ రేటు 8.3 నుంచి 10 శాతానికి పెరిగింది.
మైగ్రేన్‌తో బాధపడుతున్నారా? ఈ ఆహారాలను దూరం పెట్టండి!
హోం మంత్రి అనిల్ విజ్‌కు అస్వస్థత.. ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిక
కృత్రిమ కాఫీ.. ఇక కాఫీ తోటలతో పనిలేదు!
మరో 3 రోజుల్లో దుబాయ్ ఎక్స్పో
విజృంభిస్తున్న డెంగ్యూ డీ2 వేరియింట్.. అరికట్టండిలా!
క్రీడలతో పిల్లల్లో డిప్రెషన్‌కు చెక్.. మాంట్రియల్ పరిశోధన
ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్‌పై మరోసారి దాడి
అనుకోకుండా ఆవిష్కృతమైన యాంటీబయోటిక్స్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..