ఓ వృద్ధ మహిళ… చేతిలో సోవియట్ యూనియన్ జెండా… ఇప్పుడు ఈ ఫొటో, వీడియో తెగ వైరల్ అవుతోంది. సోవియట్ జెండాతో వున్న ఆ వృద్ధు ఫొటో తూర్పు ఉక్రెయిన్‌లో వైరల్ అవుతోంది. ఈ వృద్ధ మహిళ పేరు బబుష్క. ఈ బబుష్క ఉక్రెయిలో వుంటుంది. సైనికులను చూడగానే.. సోవియట్ యూనియన్ జెండాతో బయటికి వస్తుంది.
ఆ జెండాతోనే సైనికులకు స్వాగతం పలుకుతుంది. అయితే ఆ సైనికులు రష్యా సైనికులేనని నమ్మి, ఆ మహిళ స్వాగతం పలుకుతుంది. మేరే ప్యారే బచ్చో, బచ్చో… అంటూ స్వాగతం పలుకుతుంది. మీ కోసం నేను ప్రార్థనలు చేశా. పుతిన్ కోసం కూడా ప్రార్థనలు చేశా. మీరే ఎదురు రావడం ఎంతో ఆనందంగా వుంది అంటూ ఆ మహిళ అంటుంది.
కానీ.. ఆ సైనికులు రష్యా సైనికులు కాదు. ఉక్రెయిన్ సైనికులు. ఆ మహిళ స్వాగతం అనగానే.. జోక్ జోక్‌గా.. వస్తున్నాం.. వస్తున్నాం.. అంటూ స్పందించారు. ఇక్కడి రండి.. ఈ ఆహారం తీసుకోండి. ఆ ఎర్ర జెండా ఇచ్చేయండి. అని అంటారు. ఎర్ర జెండా ఇవ్వడానికి ఆ మహిళ నిరాకరిస్తుంది. మీరు ఆహారం తీసుకోండి. మీకు ఆహారం అత్యావశ్యకం… అంటూ మహిళ ఆ సైనికులతో అంటుంది. ఆ మహిళకు నచ్చ జెప్పే ప్రయత్నం చేసినా… వినదు. చివరికి ఆ మహిళకు ఆహారం ఇచ్చేసి, ఆమె చేతిలోని ఎర్ర జెండాను ఉక్రెయిన్ సైనికులు తీసుకెళ్లిపోతారు.
అయినా ఆ వృద్ధ మహిళ వారిని వారిస్తుంది. అడ్డు తగులుతుంది. ఆహారం తీసుకొని, తన ఎర్రజెండా తిరిగి ఇచ్చేయమని అడుగుతుంది. అయినా ఉక్రెయిన్ సైనికులు వినరు. చివరికి ఆ మహిళ మాట్లాడుతూ… ఈ దేశాన్ని విముక్తం చేయడానికి నా పూర్వులు జర్మన్లతో పోరాడిన జెండాపై మీ పాదాలను ఉంచారు.. అంటూ ఘాటుగా అంటుంది. ఈ వీడియో తూర్పు ఉక్రెయిన్‌లో తెగ వైరల్ అవుతోంది.