Viral Photos: శిథిల భవనాల్లో ఉక్రెయిన్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ ఫొటోషూట్! ఎందుకోసమంటే?!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్లో ఎటుచూసినా శిథిల భవనాలు, శవాల కుప్పలు కనిపిస్తూనే ఉన్నాయి. ఉక్రెయిన్ ప్రజలు నిత్యం బాంబు శబ్దాల మధ్యే జీవనం సాగిస్తున్నారు. పలవురు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వలసపోతున్నారు. కాగా, తమ బాధను వ్యక్తపరిచేందుకు ఉక్రెయిన్ విద్యార్థులు వినూత్న పంథాను ఎంచుకున్నారు. రష్యా బాంబు దాడుల్లో శిథిలమైన భవనాల వద్ద గ్రాడ్యుయేషన్ ఫొటోషూట్ చేశారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్లో ఎటుచూసినా శిథిల భవనాలు, శవాల కుప్పలు కనిపిస్తూనే ఉన్నాయి. ఉక్రెయిన్ ప్రజలు నిత్యం బాంబు శబ్దాల మధ్యే జీవనం సాగిస్తున్నారు. పలవురు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వలసపోతున్నారు. కాగా, తమ బాధను వ్యక్తపరిచేందుకు ఉక్రెయిన్ విద్యార్థులు వినూత్న పంథాను ఎంచుకున్నారు. రష్యా బాంబు దాడుల్లో శిథిలమైన భవనాల వద్ద గ్రాడ్యుయేషన్ ఫొటోషూట్ చేశారు.

రష్యా బాంబు దాడుల్లో చెర్నిహివ్ పట్టణంలోని చాలా భవనాలు శిథిలమైపోయాయి. చెర్నిహివ్ రూపురేఖలు మారిపోయాయి. కాగా, కొంతమంది హై స్కూల్ విద్యార్థులు తమ గ్రాడ్యుయేషన్ డే ద్వారా తమ బాధను ప్రపంచానికి చూపాలనుకున్నారు. ఈ శిథిల భవనాల సాక్షిగా తమ గ్రాడ్యుయేషన్ డే ఫొటో షూట్ చేశారు. ఉత్తర ఉక్రెయిన్లోని చెర్నిహివ్లో 40 మంది విద్యార్థుల చాలా ముఖ్యమైన స్టోరీని డాక్యుమెంట్ చేస్తున్నట్లు ఫొటోగ్రాఫర్ స్టానిస్లావ్ సెనిక్ చెప్పారు. మరో 10-15 ఏళ్లలో వీళ్లందరికీ పిల్లలు పుడుతారని, తాము అనుభవించిన బాధను ఈ ఫొటోల ద్వారా వాళ్లకు తెలియజేస్తారన్నారు.

ఒక ఫొటోలో విద్యార్థులు యుద్ధ ట్యాంక్పైన నిల్చున్నారు. తమ చాతీపై గ్రాడ్యుయేషన్ బ్యాడ్జీలు వేలాడుతుండగా విషణ్న వదనంతో చూస్తుండిపోయారు. మరో ఫొటోలో కొంతమంది విద్యార్థినులు కూలిపోయిన భవనం వద్ద ఫోజులిచ్చారు. పై అంతస్థులో వారి స్నేహితులు కిందికి చూస్తూ కనిపించారు.

తాము ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నామో ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నామని ఓల్హా బేబినెట్స్ అనే అమ్మాయి తెలిపింది. ఈ పరిస్థితుల్లో గ్రాడ్యుయేషన్ డే చేసుకోవడం చాలా బాధాకరమైనప్పటికీ..మా పెయిన్ అందరికీ తెలియాలనే కలిసికట్టుగా ఫొటోషూట్లో పాల్గొన్నట్లు చెప్పింది. ఈ ఫొటోలను ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తామని, వాటిని అమ్మి ఉక్రెయిన్ కోసం పోరాడుతున్న సైనికులకు ఇస్తామని తెలిపింది.

Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
Kuravi | వీరన్న సన్నిధిలో బీఆర్ఎస్ మహిళా నేతల పూజలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

