Russia-Ukrain war | రష్యా వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ దాడులు.. హెలిక్యాప్టర్లు, రన్వేలు ధ్వంసం
Russia-Ukrain war | రష్యాతో యుద్ధం మొదలైనప్పటి నుంచి గతంలో ఎన్నడూ లేనంత భారీస్థాయిలో ఆ దేశానికి చెందిన వైమానిక స్థావరాలపై దాడులు చేశామని, ఎయిర్‌ఫోర్స్ ఆస్తులను ధ్వంసం చేశామని ఉక్రెయిన్ ప్రకటించింది.
కీవ్: రష్యాతో యుద్ధం మొదలైనప్పటి నుంచి గతంలో ఎన్నడూ లేనంత భారీస్థాయిలో ఆ దేశానికి చెందిన వైమానిక స్థావరాలపై దాడులు చేశామని, ఎయిర్‌ఫోర్స్ ఆస్తులను ధ్వంసం చేశామని ఉక్రెయిన్ ప్రకటించింది. మరోవైపు, తన వ్యక్తిగత వివరాలు తెలిపేందుకు నిరాకరించిన ఓ అమెరికా అధికారి.. ఉక్రెయిన్ గత కొన్ని నెలలుగా అడుగుతున్న దీర్ఘశ్రేణి క్షిపణులను ఆ దేశానికి చడీచప్పుడు లేకుండా అందజేశామని చెప్పారు. ప్రస్తుతం అవి ఉక్రెయిన్ యుద్ధక్షేత్రంలో ఉన్నాయని తెలిపారు.
కాగా తూర్పు, దక్షిణ ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత ప్రాంతాలపై రాత్రిపూట జరిపిన దాడుల్లో రెండు స్థావరాల్లో తొమ్మిది హెలికాప్టర్లను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ స్పెషల్ ఆపరేషన్స్ బలగాలు ప్రకటించాయి. సైనిక పరికరాలు, గగనతల రక్షణ వ్యవస్థ, ఆయుధాగారం, రన్‌వేలను సైతం ధ్వంసం చేసినట్లు వెల్లడించాయి. ఆపరేషన్ డ్రాగన్ ఫ్లై పేరుతో నిర్వహించిన ఈ దాడుల్లో డజన్ల కొద్దీ రష్యా సైనికులు గాయపడినట్లు ఉక్రెయిన్ సేనలు వెల్లడించాయి.
పేరు చెప్పేందుకు నిరాకరించిన ఓ అమెరికా అధికారి మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌కు ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్స్ సరఫరా చేశామని చెప్పారు. గత నెలలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ విషయమై హామీ ఇచ్చారన్నారు. ఈ క్షిపణుల్లోని కొన్ని రకాలు 300 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లగలవని తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

