ఉక్రెయిన్ అధ్యక్షుడికి తృటిలో తప్పిన ప్రమాదం.. జెలెన్స్కీ కాన్వాయ్‌ను ఢీకొట్టిన వాహనం
Zelenskyy | ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ (Volodymyr Zelenskyy) పెను ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. రాజధాని కీవ్‌లో ఆయన ప్రయాణిస్తున్న కారును మరో ప్యాసింజర్ వాహనం ఢీకొట్టింది.
కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ (Volodymyr Zelenskyy) పెను ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. రాజధాని కీవ్‌లో ఆయన ప్రయాణిస్తున్న కారును మరో ప్యాసింజర్ వాహనం ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో జెలెన్స్కీ తీవ్రమైన గాయాలేమీ కాలేదని, ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని జెలెన్స్కీ ప్రతినిధి సెర్హీ నైకిఫొరోవ్ తెలిపారు. అయితే ఈ యాక్సిడెంట్ ఎప్పుడు జరిగిందనే విషయాన్ని ఆయన తెలియజేయలేదు.
అధ్యక్షుడు జెలెన్స్కీ రాజధాని కీవ్‌లో తన కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్యాసింజర్ కారు వచ్చి ఆయన ప్రయాణిస్తున్న కారుతోపాటు కాన్వాయ్‌లోని మరో వాహనాన్ని ఢీకొట్టింది. అయితే జెలెన్స్కీకి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. అధ్యక్షుడితోపాటు ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌కు వైద్యులు చికిత్స చేశారు. అనంతరం జెలెన్స్కీని అంబులెన్సులో తరలించామన్నారు.

అయితే జెలెన్స్కీని పరిశీలించిన వైద్యులు.. ఎలాంటి తీవ్రమైన గాయాలు కాలేదని చెప్పారని ఆయన వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు విచారణ జరుపుతారన్నారు. హత్యాయత్నమా లేదా ప్రమాద వశాత్తు జరిగిందా అనే విషయం విచారణలో తేలుతుందని పేర్కొన్నారు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
LuLu Mall | కూకట్పల్లి లూలూ మాల్లో దీపావళి షాపింగ్ సందడి షురూ.. బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

