Grenade attack : ఉక్రెయిన్లో మరో ఘాతుకం చోటుచేసుకుంది. ఓ విలేజ్ కౌన్సిల్ మీటింగ్లో కౌన్సిల్ సభ్యుడు గ్రెనేడ్లతో దాడి చేశాడు. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.
విలేజ్ కౌన్సిల్ సమావేశంలో సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరుగుతుండగా ఓ సభ్యుడు లేచి తన జేబులోంచి గ్రెనేడ్లు తీసి సాటి సభ్యులపైకి విసిరాడు. కౌన్సిల్లోని మిగతా సభ్యులకు ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే ఘోరం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అక్కడి పోలీసులు టెలిగ్రామ్లో పోస్ట్ చేశారు. కాగా, ఈ దాడికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.