Ukraine | కీవ్‌పై బాంబుల వర్షం కురిపించిన రష్యా..
Ukraine | నూతన సంవత్సర వేళ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా బాంబుల వర్షం కురిపించింది. కొత్త ఏడాదిలోకి ప్రవేశించిన నిమిషాల వ్యవధిలోనే కీవ్‌పై క్రెమ్లిన్ దళాలు మిస్సైల్స్‌తో విరుచుకుపడ్డాయి. రాజధాని
కీవ్: నూతన సంవత్సర వేళ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా బాంబుల వర్షం కురిపించింది. కొత్త ఏడాదిలోకి ప్రవేశించిన నిమిషాల వ్యవధిలోనే కీవ్‌పై క్రెమ్లిన్ దళాలు మిస్సైల్స్‌తో విరుచుకుపడ్డాయి. రాజధాని పట్టణంతోపాటు మరో రెండు జిల్లాలు బాంబుల మోతతో దద్దరిల్లాయని కీవ్ మేయర్ విటాలి క్లిట్స్కో తెలిపారు. సుమారు 23 బాంబులు నిర్వీర్యం చేశామని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. అంతకుముందు 11 సార్లు భారీ శబ్దాలు వినిపించాయని అంతర్జాతీయ మీడియా ప్రతినిథులు వెల్లడించారు.

కాగా, విజయం లభించేవరకు ఉక్రేనియన్లు పోరాడుతారని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. దేశమంతా ఒక జట్టులా యుద్ధాన్ని కొనసాగిస్తామని తెలిపారు. అవిరాలంగా పోరాడుతున్న ప్రతిఒక్కరిని అభినందించారు. ఇక ఉక్రెయిన్‌పై యుద్ధంలో పాల్గొంటున్న సైనికులు, ఇతర ఉద్యోగులు ఇక నుంచి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని రష్యా ప్రకటించింది. దీంతో పాటు యుద్ధంలో మానవత్వంతో ప్రవర్తించే సైనికులకు ప్రభుత్వం బహుమతులు కూడా ఇవ్వనున్నట్లు ప్రభుత్వ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. ఉక్రెయిన్, డొనెట్స్క్, లుహాన్స్క్, ఖార్సన్. జపోరిజియాలోని నాలుగు ప్రాంతాల్లో యుద్ధంలో పోరాడుతున్న సైనికులను అవినీతి నిరోధక చట్టం పరిధి నుంచి మినహాయింపు ఇచ్చినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో రష్యా సైనికులు ఇక నుంచి తమ ఆదాయం, ఖర్చులు, ఆస్తుల గురించి ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం లేదన్నమాట.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss Telugu 10 | దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ నుంచి సుధీర్‌కు ఊహించని విముక్తి,కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి!
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

