Drone Attack: రష్యాపై 50 డ్రోన్లతో ఉక్రెయిన్ అటాక్
Drone Attack: రష్యాపై ఇవాళ ఉక్రెయిన్ 40 డ్రోన్లను ఫైర్ చేసింది. బోర్డర్ ప్రాంతం రోస్టోవ్ వద్ద ఈ అటాక్ జరిగినట్లు రష్యా రక్షణ దళాలు పేర్కొన్నాయి. రష్యాతో యుద్ధం మొదలైన తర్వాత.. తొలిసారి ఉక్రెయిన్ భారీ స్థాయిలో దాడికి దిగినట్లు భావిస్తున్నారు.
కీవ్: రష్యాపై ఇవాళ ఉక్రెయిన్ 40 డ్రోన్లను ఫైర్(Drone Attack) చేసింది. బోర్డర్ ప్రాంతం రోస్టోవ్ వద్ద ఈ అటాక్ జరిగినట్లు రష్యా రక్షణ దళాలు పేర్కొన్నాయి. రష్యాతో యుద్ధం మొదలైన తర్వాత.. తొలిసారి ఉక్రెయిన్ భారీ స్థాయిలో దాడికి దిగినట్లు భావిస్తున్నారు. రష్యన్ నేలపై కీవ్ దళాలు తమ ఉదృతిని పెంచాయి. మోరోజోవెస్కీ జిల్లాలో సుమారు 40 డ్రోన్లను అడ్డగించి, ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ దళం పేర్కొన్నది. బోర్డర్ నుంచి సుమారు వంద కిలోమీటర్ల లోపలికి ఆ డ్రోన్లు చొచ్చుకు వచ్చినట్లు రష్యా రక్షణ దళం తెలిపింది. ఆ అటాక్‌లో ఓ పవర్ స్టేషన్ ధ్వంసమైంది. డ్రోన్ల దాడి వల్ల మోరోజోవెస్కీ వద్ద ఉన్న వైమానిక క్షేత్రానికి ఎటువంటి నష్టం జరిగిందన్న విషయం ఇంకా తెలియరాలేదు. కుర్స్క్, బెల్గొరోడ్, క్రాస్నడోర్ ప్రాంతాల వద్ద మరో 9 డ్రోన్లను కూల్చినట్లు రష్యా తెలిపింది.
ఉక్రెయిన్ డ్రోన్ దాడిలో ఆరు రష్యా విమానాలు ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. దీంతో పాటు 8 మందికి గాయాలు అయ్యాయి. మరో వైపు రష్యా చేసిన డ్రోన్ దాడిని ఉక్రెయిన్ తిప్పికొట్టింది. ఇవాళ 13 రష్యా డ్రోన్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- air attacks
- drones
- Russia
- Ukraine
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వీడియో
SBI Data Leak | ఎస్బీఐపై సైబర్ దాడి.. డాటా లీక్.. ఖాతాదారులు ఏం చేయాలంటే
Asian Para Games: స్ప్రింటర్ సిమ్రన్ శర్మకు రెండో గోల్డ్ మెడల్
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

