Vladimir Putin | ఉక్రెయిన్‌పై సైనిక చర్య.. పుతిన్ నిర్ణయానికి రష్యా పార్లమెంట్ ఓకే
Vladimir Putin | ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా సైనిక చర్యకు పాల్పడేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఆ దేశ పార్లమెంట్ మద్దతు పలికింది.
Vladimir Putin | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఆ దేశ పార్లమెంట్ బాసటగా నిలిచింది. ఉక్రెయిన్ వేర్పాటువాదులకు మద్దతుగా, దేశం ఆవల సైన్యం సేవలను వినియోగించేందుకు పుతిన్‌కు మద్దతుగా నిలిచింది. ఈ మేరకు పుతిన్ నిర్ణయానికి 153 మంది రష్యన్ సెనెటర్లు అంగీకారం తెలిపారు. ఒక్క సెనెటర్ కూడా వ్యతిరేకించడం గానీ, తటస్థంగా గానీ లేక పోవడం గమనార్హం. తూర్పు ఉక్రెయిన్‌లోకి సేనలను పంపేందుకు ప్రణాళికలు రూపొందించడం లేదని రష్యా విదేశాంగశాఖ ప్రకటించింది. కానీ, 2014 నుంచి ఉక్రెయిన్ ఆర్మీకి వ్యతిరేకంగా పోరాడుతున్న వేర్పాటువాదులకు మద్దతుగా ఆర్మీని ఉపయోగించేందుకు అనుమతించాలని ఫెడరేషన్ కౌన్సిల్‌ను పుతిన్ కోరారు.
రష్యా రక్షణశాఖ డిప్యూటీ మంత్రి నికొలాయ్ పాన్కోవ్ ఫెడరేషన్ కౌన్సిల్ సమావేశాల్లో మాట్లాడుతూ చర్చలు నిలిచిపోయాయి. ఉక్రెయిన్ ప్రభుత్వం హింసకు దిగడంతో రక్తపాతం జరుగుతున్నదని చెప్పారు. ఇటువంటి తరుణంలో రష్యాకు ఉక్రెయిన్ మరో చాయిస్ లేకుండా చేసిందన్నారు.
తూర్పు ఉక్రెయిన్‌లోని వేర్పాటువాదుల ఆధీనంలోని ప్రాంతాల (డీఎన్ఆర్, ఎల్ఎన్ఆర్) సరిహద్దుల్లో ఉక్రెయిన్ భారీగా ఆయుధాలతో నింపిన వాహనాలను మోహరించిందని పాన్కోవ్ ఆరోపించారు. ఉక్రెయిన్‌కు నాటో కూటమి అత్యాధునిక ఆయుధాలు పంపుతున్నదని చెప్పారు. ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు రష్యా చర్యలు తీసుకుంటుందన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

