Russia-Ukrain Conflict | రష్యాతో తెగదెంపులకు రెడీ.. తేల్చేసిన ఉక్రెయిన్ అధినేత
Russia-Ukrain Conflict | రష్యాతో దౌత్య సంబంధాలు తెగదెంపుల అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు.
Russia-Ukrain Conflict |తమ దేశంలోని వేర్పాటువాద ప్రాంతాలకు రష్యా స్వతంత్ర హోదా కల్పించడాన్ని ఉక్రెయిన్ తీవ్రంగా పరిగణించింది. రష్యాతో దౌత్య సంబంధాలను తెగదంపులు చేసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామని ప్రకటించింది. స్వాతంత్య్రం ప్రకటించుకున్న ఆ రెండు ప్రాంతాలతో తమకు సంబంధం లేదని తెలిపింది. అంతేకాదు..జర్మనీకి గ్యాస్ సరఫరా చేయడానికి రష్యా నిర్మించిన నార్డ్ స్ట్రీమ్-2 పైప్లైన్ ప్రాజెక్ట్ తక్షణం నిలిపేయాలని, తదుపరి ఎదురయ్యే ఎటువంటి పర్యవసానాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని తేల్చేసింది.
రష్యాతో సంబంధాలు తెంచుకునే అంశాన్ని పరిశీలించాలని తమ విదేశాంగ శాఖ చేసిన విజ్ఞప్తిని పరిశీలనలోకి తీసుకున్నాం అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ చెప్పారు. ఈ అంశంపై తక్షణం కసరత్తు మొదలు పెడతామని మంగళవారం మీడియాకు చెప్పారు. ఇప్పటికే ఉక్రెయిన్పై భారీ సైనిక దాడికి క్రెమ్లిన్ కుట్రపూరితంగా అడుగులేస్తున్నదన్నారు. అందులో భాగమే వేర్పాటువాద ప్రాంతాలకు స్వతంత్ర హోదా కల్పించడం తొలి అడుగు అని అన్నారు.
అంతకుముందు జాతినుద్దేశించి జెలెన్స్కీ మాట్లాడుతూ తాము శాంతినే కోరుకుంటున్నామని జెలెన్స్కీ అన్నారు. అయినా తమ భూభాగాన్ని వదులుకునేందుకు ఎటువంటి పరిస్థితుల్లోనూ సిద్ధంగా లేమని పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునే విషయంలో వెనుకడుగు వేయబోమన్నారు. ఎవ్వరికీ భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లి మండలంలో నీట మునిగిన పత్తి, వరి పంటలు
ACB Raid | రూ. 40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై
కృష్ణసాగర్లో జన జాతీయ గౌరవ దీవస్ పక్షోత్సవాలు
RS Praveenkumar | శేరిలింగంపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జా.. సాక్ష్యాధారాలతో బయటపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
అన్నదాతపై అశనిపాతం.. కన్నీరు పెట్టిస్తున్న ‘మురసు’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

