Rishi sunak | 2024 ఎన్నికల్లో కంజర్వేటివ్ పార్టీకి గడ్డు కాలమే.. సునాక్ సహా 15 మంది మంత్రుల ఓటమి తప్పదు : వైపవుట్ రిపోర్ట్
Rishi sunak | బ్రిటన్‌లో వచ్చే ఏడాది రిషి సునాక్‌కు గడ్డు కాలం ఎదురుకానున్నది. 2024 లో జరిగే సాధారణ ఎన్నికల్లో రిషి సునాక్‌తో పాటు 15 మంది క్యాబినెట్ మంత్రులు ఓటమిపాలవుతారని వైపవుట్ నివేదిక వెల్లడించింది.
Rishi sunak | మరో ఏడాది తర్వాత బ్రిటన్‌లో సాధారణ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో కంజర్వేటివ్ పార్టీకి గడ్డు కాలం తప్పదు. ప్రస్తుత ప్రధాని రిషి సునాక్‌తోపాటు 15 మంది మంత్రులకు ఓటమి తప్పదు. ఈ విషయాలను ‘వైపవుట్’ తన నివేదికలో వెల్లడించింది. ఈ నివేదికను ఇండిపెండెంట్ ప్రచురించింది. రిషి సునాక్‌తో పాటు డిప్యూటీ సీఎం డొమినిక్ రాబ్, ఆరోగ్య మంత్రి స్టీవ్ బార్క్లేతో పాటు సీనియర్ టోరీ సభ్యులు ఓడిపోవడం ఖాయమని తన ప్రత్యేక విశ్లేషణలో ‘వైపవుట్’ తెలిపింది.
ఫోకల్ డాటా బెస్ట్ ఫర్ బ్రిటన్ పోలింగ్ ప్రకారం, ఓడిపోయేవారి జాబితాలో ఇంకా విదేశాంగ కార్యదర్శి జేమ్స్ క్లీవర్లీ, డిఫెన్స్ సెక్రటరీ బెన్ వాలెస్, బిజినెస్ సెక్రటరీ గ్రాంట్ షాప్స్, కామన్స్ లీడర్ పెన్నీ మోర్డాంట్, ఎన్విరాన్మెంట్ సెక్రటరీ థెరిస్ కాఫీ కూడా ఉన్నారు. వీరితో పాటు చాలా మంది టోరీ పార్టీ ఎంపీలు తమ స్థానాలను లేబర్ పార్టీకి అప్పగించేలా ఉన్నారంట. అయితే, ఏషర్, వాల్టన్ స్థానాలు లిబరల్ డెమోక్రాట్ల చేతికి రానున్నాయని తెలిపింది. కాగా, ఐదుగురు క్యాబినెట్ మంత్రులు జెరెమీ హంట్, సుయెల్లా బ్రవర్మన్, మైఖేల్ గోవ్, నదీమ్ జవావి, కెమీ బడెనోచ్ మాత్రమే సురక్షితంగా ఉంటారని పోల్ వెల్లడించింది.
కొవిడ్ మరోసారి వ్యాప్తి చెందుతున్న కారణంగా సునాక్ ప్రభుత్వంపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. పన్నుల విధానంలో పార్టీతో విబేధాలు రావడంతో లిజ్ ట్రస్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో రిషి సునాక్ ఏమాత్రం పోటీ లేకుండానే ప్రధాని పీఠాన్ని అధిష్ఠించారు. అయితే, కొవిడ్ అనంతరం పలు ఆర్థిక సమస్యలు బ్రిటన్ ప్రభుత్వాన్ని చుట్టుముట్టాయి. ప్రస్తుతం కొత్త వేరియంట్ చాలా ప్రాంతాల్లో వ్యాప్తిచెంది ఆరోగ్య సమస్యలను తీసుకువస్తుండటం రిషి ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

