లండన్, మే 1: ఇంగ్లండ్‌కు చెందిన హ్యారీ మ్యాటడీన్ వయస్సు 34 ఏండ్లు. 2016 కంటే ముందు డిప్రెషన్, ఇతర మానసిక సమస్యలతో తీవ్ర వేదనను అనుభవించాడు. ఎవరు చెప్పారో.. ఏమోగానీ.. డిప్రెషన్ దూరం కావడానికి తన మూత్రం తనే తాగాడు. ఆశ్చర్యకరంగా అతని ఆరోగ్యం మెరుగుపడుతున్నట్టు అనిపించింది. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా రోజూ పావు లీటరు మూత్రాన్ని తాగుతూనే ఉన్నాడు. మూత్రం తాగడం వల్ల మానసిక సమస్యలు తగ్గడమే కాకుండా 10 ఏండ్లు యవ్వనంగా కనిపిస్తున్నానని హ్యారీ చెప్పుకొచ్చాడు.