లైవ్ గ్రెనేడ్లతో ఇంటిని అలంకరించిన వ్యక్తి.. విషయం తెలిసి పోలీసులు షాక్
రొటీన్ తనిఖీల సందర్భంగా ఆ ప్రాంత పోలీసులకు ఈ విషయం తెలిసింది. ఆ వ్యక్తి ఇంట్లో అలంకరించినవి లైవ్ గ్రెనేడ్లు అని గుర్తించి షాకయ్యారు. వాటిని తొలగించేందుకు బాంబ్ స్క్వాడ్ బృందాన్ని రప్పించారు.
లండన్: ఇళ్లను రకరకాల వస్తువులతో అందంగా అలంకరించేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. తమ అభిరుచికి తగిన వస్తువులను కొని డెకరేట్ చేస్తుంటారు. అయితే ఒక వ్యక్తి ఏకంగా లైవ్ గ్రెనేడ్లతో ఇంటిని అలంకరించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు షాకయ్యారు. వెంటనే బాంబ్ స్క్వాడ్‌ను రప్పించి లైవ్ గ్రెనేడ్లను తొలగించారు. విస్తూపోయే ఈ సంఘటన బ్రిటన్‌లో జరిగింది. సమ్మర్కోర్ట్లోని కార్న్‌వాల్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి తన ఇంటి అలంకరణ కోసం మూడు హ్యాండ్ గ్రెనేడ్లను కొనుగోలు చేశాడు. ఇంట్లోని ఒక చోట వాటితో డెకరేట్ చేశాడు.
కాగా, జనవరి 31న రొటీన్ తనిఖీల సందర్భంగా ఆ ప్రాంత పోలీసులకు ఈ విషయం తెలిసింది. ఆ వ్యక్తి ఇంట్లో అలంకరించినవి లైవ్ గ్రెనేడ్లు అని గుర్తించి షాకయ్యారు. వాటిని తొలగించేందుకు రాయల్ నేవీకి చెందిన ఎక్స్‌ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్ బృందాన్ని రప్పించారు. ఈ సందర్భంగా ఆ రోజు ఉదయం 11.20 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఆ ఇంటి సమీపంలోని రోడ్డును మూసివేశారు. అలాగే సేఫ్టీ కోసం పొరుగు ఇంట్లోని వారిని కూడా ఖాళీ చేయించారు.
అనంతరం బాంబ్ స్క్వాడ్ బృందం అన్ని జాగ్రత్తలు తీసుకుని మూడు లైవ్ గ్రెనేడ్లను ఆ ఇంటి నుంచి తొలగించింది. వాటిని దూరంగా తీసుకెళ్లి నిర్వీర్యం చేసింది. మరోవైపు ఇంటి అలంకరణ కోసం కొనుగోలు చేసిన గ్రెనేడ్లు పేలేవి అన్న సంగతి తనకు తెలియదని ఆ వ్యక్తి పోలీసులకు తెలిపాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పోలీస్ అధికారి వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

