Golden Visa | నర్సులు, టీచర్లకు గోల్డెన్ వీసా.. యూఏఈ ఆఫర్..!
ర్సులకు పదేళ్ల గోల్డెన్ వీసా ఇవ్వనున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఈ నెల 12న ప్రకటించింది. దుబాయ్ హెల్త్ శాఖలో 15 సంవత్సరాలకుపైగా పని చేసిన అనుభవం కలవారికి ఈ వీసాను ఇస్తామని తెలిపింది.
- దుబాయ్‌లో 15 ఏళ్లకుపైగా అనుభవం ఉన్నవారికి శుభవార్త
దుబాయ్ : నర్సులకు పదేళ్ల గోల్డెన్ వీసా ఇవ్వనున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఈ నెల 12న ప్రకటించింది. దుబాయ్ హెల్త్ శాఖలో 15 సంవత్సరాలకుపైగా పని చేసిన అనుభవం కలవారికి ఈ వీసాను ఇస్తామని తెలిపింది. ఎంపిక చేసిన విదేశీయులకు 10 ఏళ్ల రెసిడెన్సీని ఇచ్చే గోల్డెన్ వీసా పథకాన్ని 2019లో ప్రారంభించారు.
విద్య, వైద్య రంగాల్లో క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్; పెట్టుబడిదారులు, ఔత్సాహిక పారిశ్రమికవేత్తలు; సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మక పరిశ్రమలు, గేమింగ్ వంటి రంగాల్లో పని చేసే నైపుణ్యంగల కార్మికులు ఈ వీసాను పొందవచ్చు. పదేళ్ల గోల్డెన్ వీసా పథకాన్ని టీచర్లు, విద్యావేత్తలకు కూడా వర్తింపజేస్తామని విజ్ఞానం, మానవాభివృద్ధి సంస్థ ప్రకటించింది. దుబాయ్‌లోని ప్రైవేట్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్‌కు ఇది వర్తిస్తుందని తెలిపింది. శిశు సంరక్షణ కేంద్రాలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలలో పని చేస్తూ, అద్భుతమైన పనితీరు కనబరచిన, విద్యా ప్రమాణాలను పెంచినవారికి గోల్డెన్ వీసా ఇస్తామని చెప్పింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

