నాటో నుంచి అమెరికా ఎగ్జిట్!
ఇరాన్‌తో సాగిస్తున్న యుద్ధానికి మద్దతు ఇవ్వడంపై ఐరోపా మిత్రదేశాల నుంచి వరుస ఎదురుదెబ్బలు తిన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవస్థాపక సభ్యదేశంగా ఒకప్పుడు అమెరికా ఏర్పాటు చేసిన సైనిక కూటమి నాటో నుంచి నిష్క్రమించాలన్న సంచలన ఆలోచనను బయటపెట్టారు.
- రెండో ఆలోచన లేదన్న ట్రంప్..అదో కాగితం పులి అంటూ ఎద్దేవా
వాషింగ్టన్, ఏప్రిల్ 1: ఇరాన్‌తో సాగిస్తున్న యుద్ధానికి మద్దతు ఇవ్వడంపై ఐరోపా మిత్రదేశాల నుంచి వరుస ఎదురుదెబ్బలు తిన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవస్థాపక సభ్యదేశంగా ఒకప్పుడు అమెరికా ఏర్పాటు చేసిన సైనిక కూటమి నాటో నుంచి నిష్క్రమించాలన్న సంచలన ఆలోచనను బయటపెట్టారు. ఇరాన్‌తో యుద్ధంలో తమతో చేతులు కలుపడానికి నిరాకరించిన తర్వాత నాటో నుంచి అమెరికాను బయటకు తీసుకురావాలని యోచిస్తున్నట్లు టెలిగ్రాఫ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ వెల్లడించారు. ఇరాన్‌తో చేస్తున్న యుద్ధంలో నాటో దేశాల నుంచి ఎటువంటి సహాయం లేదని ఇటీవల పలు సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్.. నాటో నుంచి తనకు ఎటువంటి సహాయం అవసరం లేదని తెగేసి చెప్పారు.
నాటో సైనిక కూటమిని కాగితం పులిగా టెలిగ్రాఫ్ ఇంటర్వ్యూలో అభివర్ణించిన ట్రంప్ ఈ కూటమి నుంచి బయటపడాలన్న ఆలోచనను పునఃపరిశీలించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఇరాన్ యుద్ధం తర్వాత నాటోలో అమెరికా సభ్యత్వం గురించి పునరాలోచిస్తారా అన్న ప్రశ్నకు తాను నాటోతో ఎన్నడూ అంట కాగలేదని ఆయన తెలిపారు. అది కాగితం పులి అన్న విషయం తనకు ఎప్పటి నుంచో తెలుసని, ఆ విషయం పుతిన్‌కు కూడా తెలుసని ట్రంప్ చెప్పారు. పశ్చిమ దేశాల్లోని తన మిత్ర దేశాల నుండి ఎదురైన పలు ఎదురుదెబ్బలు, ముఖ్యంగా ఫిబ్రవరి 28 తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో నాటో దేశాల పట్ల ట్రంప్ తీవ్ర అసంతృప్తితో రగులుతున్నారు. హొర్ముజ్ జలసంధిపై ఇరాన్ దిగ్బంధాన్ని తొలగించే ప్రయత్నాల్లో పాలుపంచుకోవాలని ట్రంప్ ఐరోపా దేశాలకు, వాటి యుద్ధనౌకలకు పిలుపు ఇచ్చినపుడు ఒక్క దేశం కూడా సానుకూలంగా స్పందించలేదు. ఇరాన్‌తో పోరాడుతున్న అమెరికా యుద్ధ విమానాలకు తమ గగనతలాన్ని స్విట్జర్లాండ్, స్పెయిన్ నిరాకరించాయి. సిసిలీలోని స్థావరాల్లో దిగాలని కోరుతున్న అమెరికా విమానాలకు ఇటలీ కూడా అనుమతి నిరాకరించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- America
- Donald Trump
- Iran war
- NATO
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

