Virginia | వర్జీనియాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు
అగ్రరాజ్యం అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. వర్జీనియాలోని (Virginia) రిచ్మండ్లో (Richmond) హైస్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుక తర్వాత జరిగిన కాల్పుల్లో (Gun fire) ఇద్దరు మృతిచెందగా, మరో 12 మంది గాయపడ్డారు.
వర్జీనియా: అగ్రరాజ్యం అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. వర్జీనియాలోని (Virginia) రిచ్మండ్లో (Richmond) హైస్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుక తర్వాత జరిగిన కాల్పుల్లో (Gun fire) ఇద్దరు మృతిచెందగా, మరో 12 మంది గాయపడ్డారు. మంగళవారం సాయంత్రం హ్యూగెనాట్ హైస్కూల్లో (Huguenot High School) గ్రాడ్యుయేషన్ కార్యక్రమం (Graduation ceremony) జరిగింది. అనంతరం స్కూలు సమీపంలో ఉన్న మన్రో పార్కులో దుండగులు కాల్పులకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు. మరణించినవారిలో 18, 36 ఏండ్ల వయస్కులు ఉన్నట్లు వర్జీనియా సిటీ పోలీస్ చీఫ్ రిక్ ఎడ్వర్డ్స్ వెల్లడించారు.
హ్యూగెనాట్ హైస్కూల్ గ్రాడ్యుయేషన్ తర్వాత మన్రో పార్క్‌లో కాల్పులు జరిగినట్లు రిచ్మండ్ పబ్లిక్ స్కూల్స్ అధికారి మాథ్యూ స్టాన్లీ తెలిపారు. ఈ కాల్పుల ఘటనతో మరో పాఠశాల గ్రాడ్యుయేషన్ వేడుకను రద్దు చేశామని చెప్పారు. కాల్పులు జరిగిన మన్రో పార్క్ వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్నామని నగర మేయర్ లెవర్ ఎం. స్టోనీ ట్విట్టర్ వేదిక ప్రకటించారు. ప్రజలెవరూ ఈ ప్రాంతానికి రావద్దని కోరారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Murasu | తీవ్ర తుపానుగా బలపడిన ‘మురాసు’.. ఏపీ తీరానికి పొంచి ఉన్న పెను ముప్పు!
గ్లామర్ డోస్ పెంచేసిన హెబ్బా పటేల్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బోల్డ్ ఫొటోషూట్!
Ramayana | రామాయణకు భారీ స్పందన.. ఒక్కరోజులోనే 36 వేలకి పెరిగిన అడ్వాన్స్ బుకింగ్స్!
RTC Bus Fare | కర్ణాటకలో ఆర్టీసీ చార్జీల బాదుడు.. నవంబర్ 5 నుంచి కొత్త రేట్లు!
Trump Warning | 10 నిమిషాల్లో మీ అణుశక్తిని అంతం చేస్తాం’.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

