అడవిలో తప్పిపోయిన ఇద్దరు పిల్లలు.. నెల రోజుల తర్వాత ఏ పరిస్థితిలో కనిపించారో తెలుసా?
చిన్న చిన్న పక్షులను పట్టుకోవడం కోసం అని.. అడవిలోకి వెళ్లిన పిల్లలు కనిపించకుండా పోయారు. వాళ్ల కోసం తల్లిదండ్రులు వెతకని
అచ్చం సినిమా కథను తలపించేలా ఇద్దరు పిల్లలు అడవిలో తప్పిపోయారు. వాళ్ల కోసం ఎంత వెతికినా దొరకలేదు. చివరకు నెల రోజుల తర్వాత వాళ్ల జాడ దొరికింది. వాళ్లు ఏ పరిస్థితిలో కనిపించారు.. నెల రోజుల పాటు అడవిలో బతికి ఎలా బయటపడ్డారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
బ్రెజిల్‌లోని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌లో ఇద్దరు అన్నదమ్ములు.. 6 ఏళ్ల గ్లెయిసన్ ఫెర్రైరా, 8 ఏళ్ల గ్లువాకో తప్పిపోయారు. అమెజానస్ రాష్ట్రంలోని మానికోర్ అనే ప్రాంతంలో ఫిబ్రవరి 18న తప్పిపోయారు. చిన్న చిన్న పక్షులను పట్టుకోవడం కోసం అని.. అడవిలోకి వెళ్లిన పిల్లలు కనిపించకుండా పోయారు. వాళ్ల కోసం తల్లిదండ్రులు వెతకని ప్లేస్ లేదు. అడవంతా గాలించినా వాళ్ల జాడ మాత్రం దొరకలేదు. చివరకు రెస్క్యూ టీమ్ కూడా రంగంలోకి దిగింది. అడవిని జల్లెడ పట్టింది. అయినా వాళ్ల జాడ కనిపించలేదు.
దీంతో ఇద్దరు పిల్లల మీద పేరెంట్స్ ఆశ వదిలేసుకున్నారు. ఎందుకంటే.. ప్రపంచంలోనే అతి పెద్ద రెయిన్ ఫారెస్ట్ అది. అడవిలో బతకాలన్నా కష్టమే. తినడానికి ఏం దొరకదు. వర్షపు నీళ్లు తప్ప.
అయితే.. అడవిలో తప్పిపోయిన ఇద్దరు పిల్లలు.. నాలుగు వారాల పాటు అంటే నెల రోజుల పాటు కేవలం వర్షపు నీటిని తాగి ప్రాణాలను కాపాడుకున్నారు. నెల రోజుల తర్వాత చెట్లు కొట్టే ఓ వ్యక్తికి ఇద్దరు పిల్లలు తారసపడ్డారు. దీంతో ఆ పిల్లలను అతడు రక్షించి.. వెంటనే వాళ్లను తల్లిదండ్రుల వద్దకు చేర్చాడు.
పిల్లలు తన కంట పడ్డప్పుడు.. బక్క చిక్కిపోయి.. ఆకలితో దీనస్థితిలో ఉన్నారట. వాళ్ల శరీరం మీద చాలా గాయాలు కూడా చూశాడట. వెంటనే వాళ్ల పేరెంట్స్‌కు పిల్లలను అప్పగించడంతో వెంటనే పిల్లలను ఆసుపత్రిలో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పించారు. దీంతో వాళ్లు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. నెల రోజుల పాటు అడవిలోనే ఉండి.. పిల్లలు ప్రాణాలతో బయటపడటంతో అక్కడి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

