Pakistan | పాకిస్తాన్ చుట్టూ చక్కర్లు కొడుతున్న టర్కీ యుద్ధ విమానాలు.. ఏం జరుగుతోంది
Pakistan : టర్కీకి చెందిన యుద్ధ విమానాలు వరుసగా పాకిస్తాన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. పాకిస్తాన్ వస్తూ.. అక్కడి నుంచి తిరిగి వెళ్తూ.. ప్రయాణం సాగిస్తున్నాయి. మూడు రోజులుగా ఇదే పరిస్థితి ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి.
Pakistan : టర్కీకి చెందిన యుద్ధ విమానాలు వరుసగా పాకిస్తాన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. పాకిస్తాన్ వస్తూ.. అక్కడి నుంచి తిరిగి వెళ్తూ.. ప్రయాణం సాగిస్తున్నాయి. మూడు రోజులుగా ఇదే పరిస్థితి ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఆగష్టు 19, 20, 21 తేదీల్లో టర్కీ యుద్ధ విమానాలు అనేకం పాకిస్తాన్ వచ్చి వెళ్లాయి. అది కూడా వరుసగా వస్తూ, పోతూ ఉన్నాయి. ముఖ్యంగా టర్కీకి చెందిన సీ-130 హెర్క్యులెస్ అనే రవాణా విమానాలు ఎక్కువసార్లు ఇరు దేశాల మధ్య సంచరించాయి.
ఈ యుద్ధ విమానాలు సరుకుల్ని రవాణా చేయగలవు. గడిచిన 60 గంటల్లో ఇవి పలుమార్లు టర్కీ నుంచి పాక్.. అక్కడి నుంచి టర్కీ వెళ్లాయి. ఉన్నట్లుండి ఇలా టర్కీ విమానాలు పాక్ ఎందుకు వెళ్తున్నాయి అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీని గురించి అధికారిక ప్రకటన ఏదీ లేదు. కానీ, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. టర్కీ నుంచి పాకిస్తాన్‌లోని, రావల్పిండిలో ఉన్న నుర్ ఖాన్ ఎయిర్‌బేస్‌కు, కరాచీలోని మస్రూర్ ఎయిర్‌బేస్‌కు యుద్ధ విమానాలు రాకపోకలు సాగించాయి. ఇది అసాధారణమైన ప్రక్రియ. ఇటీవల పాకిస్తాన్ తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆయుధాల నిల్వలను పెంచుకుంటోంది.
అందుకే ప్రస్తుతం డ్రోన్ల (మానవ రహిత యుద్ధ విమానాలు)ను భారీగా కొనుగోలు చేస్తోంది. దీనిలో భాగంగా టర్కీ నుంచి భారీగా డ్రోన్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (వైమానిక దాడి రక్షణ వ్యవస్థ)ను కొనుగోలు చేస్తోంది. వీటిని యుద్ధ విమానాల ద్వారా టర్కీ.. పాకిస్తాన్‌కు సరఫరా చేస్తోంది. భారీ స్థాయిలో పాకిస్తాన్‌కు టర్కీ డ్రోన్లు అందించినట్లు అంచనా. డ్రోన్లతోపాటు అత్యున్నత క్షిపణి రక్షణ వ్యవస్థను టర్కీ అందించింది. వీటిలో బేరక్టార్ టీబీ2 చాలా కీలకం. ఇది టర్కీ అభివృద్ధి చేసిన మిడ్ రేంజ్ డ్రోన్. దీన్ని టర్కీ.. గతంలో ఉక్రెయిన్‌కు కూడా అందించింది. ఈ డ్రోన్లను ఉక్రెయిన్.. రష్యాపై దాడికి వాడింది.
అత్యంత ప్రభావవంతమైన డ్రోన్‌గా దీనికి పేరుంది. ఇటీవల టర్కీ, పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య సైనిక, రక్షణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఇస్లామిక్ నాటోగా దీన్ని పిలుచుకుంటున్నారు. యుద్ధ సమయంలో ఒక దేశానికి మరో దేశం సహకరించుకోవాలనేది ఈ దేశాల మధ్య ఒప్పందం. దీనిలో భాగంగానే ఈ డ్రోన్లను పాకిస్తాన్‌కు టర్కీ సరఫరా చేస్తోందా అనే సందేహాలున్నాయి. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ ఈ వ్యవహారాల్ని పర్యవేక్షిస్తున్నాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

