Tulsi Gabbard: కోవిడ్ వైరస్ లీకైన వుహాన్ ల్యాబ్‌కు.. ఫౌసీ నిధులు అందించారు: తులసీ గబ్బార్డ్
Tulsi Gabbard: చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీకైన విషయం తెలిసిందే. అయితే ఆ ల్యాబ్‌కు అమెరికా డాక్టర్ ఆంథోనీ ఫౌసీ నిధులను మళ్లించినట్లు నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ ఆరోపించారు. అమెరికా పన్నుదారుల సొమ్మును అక్రమరీతిలో వుహాన్ ల్యాబ్‌కు ఇచ్చినట్లు ఆమె తెలిపారు. కరోనా వైరస్ లీకేజీ అంశంలో వాస్తవాలను ఫౌసీ దాచిపెట్టారని ఆరోపించారు.
న్యూయార్క్: అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్(Tulsi Gabbard) సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్‌కు మెడికల్ అడ్వైజర్‌గా ఉన్న డాక్టర్ ఆంథోనీ ఫౌసీ.. చైనాలోని వుహాన్ వైరాలజీ ఇన్స్టిట్యూట్కు ఫండింగ్ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. కోవిడ్19 వ్యాప్తికి కారణమైన ఆ ల్యాబ్‌పై సమాచారాన్ని దాచి పెట్టే విధంగా ఫౌసీ ప్రవర్తించినట్లు ఆమె తెలిపారు. వుహాన్ ల్యాబ్ గురించి అమెరికా కాంగ్రెస్‌ను కూడా ఫౌసీ తప్పుదోవ పట్టించారని తులసీ గబ్బార్డ్ పేర్కొన్నారు. నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ హోదా నుంచి వైదొలుగుతున్న తులసీ గబ్బార్డ్.. తన ఆఫీసు చివరి రోజున ఈ సంచలన విషయాలను వెల్లడించారు.
కరోనా వైరస్ వ్యాప్తికి, చైనాలోని వుహాన్ వైరాలజీ ల్యాబ్‌కు కనెక్షన్ ఉన్నట్లు గతంలో అమెరికా ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే తన వద్ద ఉన్న క్లాసిఫైడ్ సమాచారాన్ని బయటపెడుతున్నట్లు తులసీ పేర్కొన్నారు. కోవిడ్ వివాదంలో ఫౌసీ పాత్రను బుట్టదాఖలు చేయాలన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్లు ఆమె చెప్పారు. తాను రిలీజ్ చేసిన సమాచారంలో గతంలో వెల్లడి కాని అనేక విషయాలు ఉన్నట్లు ఆమె చెప్పారు. వుహాన్‌లోని కరోనా వైరస్ రీసర్చ్ సంస్థకు ఫౌసీ నిధులు అందించినట్లు ఆమె ఆరోపించారు.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో.. ఇంటెలిజెన్స్ అధికారులతో కలిసి ఫౌసీ వ్యవహరించిన తీరును ఆమె తన డాక్యుమెంట్‌తో డీక్లాసిఫై చేశారు. అమెరికా పన్నుదారులకు చెందిన నిధులను అక్రమ రీతిలో వుహాన్ రీసర్చ్ ల్యాబ్‌కు ఫౌసీ తరలించారని, ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు ఇంటెలిజెన్స్ కమ్యూనిటీతో రాజకీయంగా వత్తిళ్లు తెచ్చినట్లు తులసీ గబ్బార్డ్ ఆరోపించారు. వుహాన్ ల్యాబ్‌లో కరోనా వైరస్ గురించి ఫౌసీకి తెలుసు అని, కానీ ఆయన అమెరికా ప్రజలను, ఉభయసభలను తప్పుదోవ పట్టించారని ఆమె ఆరోపించారు.
గతంలో అమెరికా అంటువ్యాధుల సంస్థ(ఎన్ఐఏఐడీ)కి అధిపతిగా ఫౌసీ బాధ్యతలు నిర్వర్తించారు. వుహాన్ వైరాలజీ ల్యాబ్‌లో గబ్బిలాలకు చెందిన కరోనా వైరస్‌పై పరిశోధన జరుగుతున్న అంశం గురించి తెలుసుకునేందుకే.. ఫౌసీ ప్రజల నిధులను దుర్వినియోగం చేసినట్లు గబ్బార్డ్ తన ప్రకటనలో ఆరోపించారు. కరోనా సమయంలో అధ్యక్షుడు ట్రంప్, ఫౌసీ మధ్య కూడా విభేధాలు తలెత్తిన విషయం తెలిసిందే.
Today, on my final day as Director of National Intelligence, I’m releasing never-before-seen communications and documents exposing how Dr. Fauci provided millions in US taxpayer dollars to fund dangerous gain-of-function research at the Wuhan lab, worked with politicized elements… pic.twitter.com/ZMdliW4zyS
— DNI Tulsi Gabbard (@DNIGabbard) June 19, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

