HomeInternationalTrump Repeats Claim He Ended 7 Wars Including India Pak In Un Speech
భారత్-పాక్ సహా ఏడు యుద్ధాలను ఆపా!
భారత్-పాక్ సహా ఏడు యుద్ధాల్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. ఐక్యరాజ్యసమితి చేయాల్సిన పని.. తాను చేయాల్సి రావటం బాధాకరమంటూ ఐరాసపై విమర్శలు గుప్పించారు.
ఐరాస చేయాల్సిన పనిని నేను చేశా: ట్రంప్
న్యూయార్క్: భారత్-పాక్ సహా ఏడు యుద్ధాల్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. ఐక్యరాజ్యసమితి చేయాల్సిన పని.. తాను చేయాల్సి రావటం బాధాకరమంటూ ఐరాసపై విమర్శలు గుప్పించారు. మంగళవారం ఐక్యరాజ్యసమితి 80వ సాధారణ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ట్రంప్, ప్రపంచ దేశాల నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఏయే దేశాల మధ్య యుద్ధాల్ని ఆపింది.. ట్రంప్ వాటి జాబితా చదివి వినిపించారు. ‘కేవలం ఏడు నెలల్లో..ఇతరులు అసాధ్యమని భావించే విధంగా ఏడు యుద్ధాల్ని ఆపాను. ఒకటి 31 ఏండ్లుగా, మరోటి 36 ఏండ్లుగా కొనసాగుతున్న సంక్షోభాలు ’ అని అన్నారు.