Donald Trump | ‘నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది’ అన్న ట్రంప్.. నిరసనలకు పిలుపు!
Donald Trump | వచ్చే మంగళవారం తనను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపాలని తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు.
Donald Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను మంగళవారం అరెస్ట్ చేసే అవకాశం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. 2016 దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు ఒక శృంగార తారకు భారీ మొత్తంలో మనీ ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణల కేసులో తనను ఫెడరల్ పోలీస్ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పారు. తనను అరెస్ట్ చేస్తే నిరసనలకు దిగాలని ట్రంప్ తన అభిమానులకు పిలుపునిచ్చారు. ‘మాన్‌హట్టన్ డిస్ట్రిక్ అటార్నీ’ ఆఫీస్ నుంచి ‘లీక్’ వచ్చిందని ఆరోపిస్తూ శనివారం ఉదయం ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో పోస్ట్ రాసుకున్నారు. ‘అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో లీడింగ్ రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడిని వచ్చేవారం మంగళవారం అరెస్ట్ చేయొచ్చు. దీనికి వ్యతిరేకంగా నిరసన తెలుపండి’ అని పిలుపునిచ్చారు.
స్టోర్మీ డానియల్స్ అలియాస్ స్టీఫెన్ క్లిఫోర్డ్ అనే మహిళ.. తాను కొన్నేండ్ల పాటు ట్రంప్‌తో కలిసి సహజీవనం చేశానని ఆరోపణలు చేశారు. ఈ సంగతి ఆమె బయట పెట్టకుండా ఉండేందుకు స్టోర్మీ డానియల్స్‌కు ట్రంప్.. 2016 దేశాధ్యక్ష ఎన్నికలకు కొన్ని వారాల ముందు 1.30 లక్షల డాలర్లు చెల్లించారన్న అభియోగంపై దర్యాప్తు అధికారులు విచారణ జరిపారు. ట్రంప్‌ను దర్యాప్తు అధికారులు ప్రాసిక్యూట్ చేస్తారా? లేదా? అన్న సంగతి ఇంకా తెలియరాలేదు.
ఒకవేళ ట్రంప్‌పై మాన్‌హట్టన్ డిస్ట్రిక్ అటార్నీ అభియోగాలు నమోదు చేస్తే, అమెరికా చరిత్రలో ఒక నేరాభియోగాన్ని ఎదుర్కొంటున్న మాజీ దేశాధ్యక్షుడిగా ట్రంప్ నిలిచిపోతారు. డానియల్స్‌తో తనకు ఎటువంటి వ్యవహారాలు, సంబంధ బాంధవ్యాలు లేవని ట్రంప్ కొట్టి పారేశారు. మాన్‌హట్టన్ గ్రాండ్ జ్యూరీ ఒకవేళ ట్రంప్‌పై నేరాభియోగాలు నమోదు చేస్తే, ఆయన క్రిమినల్ అభియోగాలను ఎదుర్కొనేందుకు పోలీసులకు లొంగిపోవాల్సి ఉంటుందని ట్రంప్ తరఫు న్యాయవాది తెలిపారు. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై క్యాపిటల్ లెటర్స్‌తో ‘పూర్తిగా అవినీతి మయమైన, రాజకీయ మాన్‌హట్టన్ డిస్ట్రిక్ట్ అటార్నీ ఆఫీసు చట్ట విరుద్ధంగా లీక్‌లు ఇస్తుంది’ అని అభియోగం మోపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

