Donald Trump | అమెరికా కొంటుంది.. గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ కన్ను!
అమెరికాను మళ్లీ ఉన్నతంగా తీర్చిదిద్దుతానని ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్ ప్రతి రోజు ఒక్కొక్క దేశానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాజాగా ఆయన దృష్టి డెన్మార్క్‌లో భాగమైన గ్రీన్‌లాండ్‌పై పడింది. ఇది 600కుపైగా సంవత్సరాలుగా డెన్మార్క్‌లో భాగంగా ఉంది.
- పనామా కాలువను స్వాధీనం చేసుకుంటామని ఇదివరకే వెల్లడి
- తాము అమ్మకానికి లేమన్న గ్రీన్లాండ్ ప్రధాని ఎగెడే
Donald Trump | వాషింగ్టన్: అమెరికాను మళ్లీ ఉన్నతంగా తీర్చిదిద్దుతానని ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్ ప్రతి రోజు ఒక్కొక్క దేశానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాజాగా ఆయన దృష్టి డెన్మార్క్‌లో భాగమైన గ్రీన్‌లాండ్‌పై పడింది. ఇది 600కుపైగా సంవత్సరాలుగా డెన్మార్క్‌లో భాగంగా ఉంది. ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో స్పందిస్తూ.. దేశ భద్రత, ప్రపంచ స్వేచ్ఛ కోసం గ్రీన్‌లాండ్‌పై యాజమాన్యం, నియంత్రణ కచ్చితంగా ఉండాలని అమెరికా భావిస్తున్నదని పేర్కొన్నారు. గ్రీన్‌లాండ్‌పై నియంత్రణ కావాలనే కోరికను ఆయన తన మొదటి అధ్యక్ష పదవీ కాలంలోనే వ్యక్తం చేశారు.
ఘాటుగా స్పందించిన గ్రీన్లాండ్ పీఎం ట్రంప్ హెచ్చరికపై గ్రీన్లాండ్ ప్రధాన మంత్రి ముటే ఎగెడే ఘాటుగా స్పందించారు. “మేం ఎన్నటికీ అమ్మకానికి ఉండబోము. స్వాతంత్య్రం కోసం మా సుదీర్ఘ యుద్ధాన్ని ఓడిపోబోం” అని తెలిపారు. పనామా ప్రెసిడెంట్ ఘాటు జవాబు పనామా కాలువ గుండా వెళ్తున్న అమెరికా నౌకలకు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారని, దానిని తిరిగి తమకు అప్పగించాలని ట్రంప్ చేసిన హెచ్చరికలపై పనామా ప్రెసిడెంట్ జోస్ రౌల్ ములినో ఘాటుగా స్పందించారు. పనామా కాలువలో ప్రతి చదరపు మీటరు పనామాకే చెందుతుందని స్పష్టం చేశారు. ట్రంప్ వ్యాఖ్యలు తమ సార్వభౌమాధికారాన్ని కించపరచడమేనని మండిపడ్డారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

