న్యూయార్క్: మలం మార్పిడి చికిత్స ద్వారా క్లాస్ట్రిడియోడిస్ డిఫిసిల్ (సీ-డిఫ్) ఇన్ఫెక్షన్ను యాంటిబయాటిక్ చికిత్స కంటే సమర్థంగా నయం చేయవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. సీ డీఫ్ బ్యాక్టీరియా వల్ల డయేరియా, కడుపునొప్పి వస్తాయి. లండన్లోని కాక్రేన్ రివ్యూకు చెందిన శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం చేశారు.
77 శాతం మంది ఎనిమిది వారాల పాటు మళ్లీ ఇన్ఫెక్షన్కు గురి కాలేదని, యాంటిబయాటిక్ చికిత్స పొందిన వారిలో 40 శాతం మందే మళ్లీ ఇన్ఫెక్షన్ బారిన పడలేదని వెల్లడైంది. యాంటిబయాటిక్లు సమర్థంగా పనిచేసినా, మంచి బ్యాక్టీరియాకు నష్టం చేస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.