వాషింగ్టన్, మార్చి 23: అమెరికాకు బిజినెస్, పర్యాటక వీసాలపై వెళ్లే వారు అక్కడ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చని, ఇంటర్వ్యూలకు కూడా హాజరుకావచ్చని యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ట్వీట్ చేసింది. అయితే, ఉద్యోగంలో చేరే ముందు వీసాను మాత్రం మార్చుకోవాలని స్పష్టం చేసింది. అమెరికాకు వ్యాపార పర్యటనల నిమిత్తం వెళ్లే వారికి బీ-1 వీసా, టూరిస్టులుగా వెళ్లే వారికి బీ-2 వీసా ఇస్తారు. ఈ రెండు వీసాలపై ఉన్న వారు అమెరికాలో ఉద్యోగాన్వేషణ చేసుకోవచ్చా అని అడిగిన ప్రశ్నలకు యూఎస్సీఐఎస్ ఈ మేరకు స్పష్టతనిచ్చింది.