ఫ్రాన్స్: స్టాప్ రేపింగ్ అజ్.. మమ్మల్ని రేప్ చేయడం ఆపండి.. అంటూ ఓ మహిళ కేన్స్ రెడ్‌కార్పెట్‌పై నిరసన గళం వినిపించింది. ఉక్రెయిన్‌లో జరుగుతున్న అత్యాచారాల ఘటనలకు వ్యతిరేకంగా ఆమె ఆందోళన చేపట్టింది. రష్యా సైనికులు ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లు ఇటీవల కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రష్యా సైనికుల అకృత్యాలను నిరసిస్తూ ఓ మహిళ ఒంటరిగా అర్థనగ్న ప్రదర్శన చేపట్టింది. శరీరంపై స్టాప్ రేపింగ్ అజ్ అని రాసుకుని వచ్చిన ఆ మహిళ రెడ్‌కార్పెట్‌పై గట్టిగా అరిచింది. అయితే అక్కడే ఉన్న సెక్యూర్టీ గార్డ్స్ వచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
త్రీ థౌజండ్ ఇయర్స్ ఆఫ్ లాంగింగ్ చిత్రం ప్రీమియర్ కోసం ఏర్పాటు చేసిన రెడ్‌కార్పెట్ సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై ఆక్రమణకు వెళ్లిన రష్యా.. అక్కడ అకృత్యాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వందల సంఖ్యలో రేప్ కేసులు జరిగినట్లు ఇటీవల అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు.