విమానం గాల్లో ఉండగా ఊడిన టైరు!
బోయింగ్ విమానాలు తరచూ మొరాయిస్తూ ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో గాల్లోకి ఎగిరిన విమానం అత్యవసర ద్వారం ఊడిపోగా తాజాగా టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే మరో విమానానికి చక్రం ఊడిపోయింది.
లాస్ ఏంజెల్స్, మార్చి 8: బోయింగ్ విమానాలు తరచూ మొరాయిస్తూ ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో గాల్లోకి ఎగిరిన విమానం అత్యవసర ద్వారం ఊడిపోగా తాజాగా టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే మరో విమానానికి చక్రం ఊడిపోయింది. గురువారం శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది.
జపాన్ వెళ్లాల్సిన బోయింగ్ 777 జెట్ లైనర్ గాల్లోకి ఎగిరిన కొన్ని సెకన్లకే విమాన చక్రం ఊడిపోయింది. అది కాస్తా విమానాశ్రయ ఉద్యోగుల కారు పార్కింగ్ కోసం ఉపయోగించే స్థలంపై పడటంతో ఒక కారు ధ్వంసమైంది. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 249 మంది ప్రయాణిస్తున్నారు. హఠాత్తుగా చక్రం ఊడిపోవడంతో విమానాన్ని అత్యవసరంగా లాస్ ఏంజెల్స్ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

