ఇస్లామాబాద్: పాకిస్థాన్‌కు చెందిన టిక్‌టాక్ క్రియేటర్ , 28 ఏళ్ల షామ్సో బీబీ(TikToker Shamso Bibi) హత్యకు గురైంది. ఇస్లామాబాద్ సమీపంలో తక్సిలాలో ఆమెను పిస్తోల్‌తో కాల్చి చంపారు. ఆగస్టు 14వ తేదీన ఈ ఘటన జరిగింది. ఆమెకు టిక్‌టాక్‌లో 13 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి బీబీకి బెదిరింపు కాల్స వస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆన్లైన్లో ఆ క్రియేటర్ పేరు అయేషా గిల్మానా. సోదరి, సోదరుడితో కారులో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో.. బైక్‌పై వచ్చిన ఇద్దరు అడ్డగించి కాల్పులు జరిపారు. బీబీకి మెడలో బుల్లెట్ దిగింది. గాయాల వల్ల ఆమె మరణించింది.
పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఈ మర్డర్ జరిగింది. ఈ హత్య కేసులో నలుగురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. కాల్పులు జరిపిన వ్యక్తి పరారీ కోసం సాయం చేసిన ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. కనీసం నాలుగేళ్ల నుంచి బీబీ టిక్‌టాక్ వీడియోలు చేస్తున్నది. ఓ దుస్తుల కంపెనీకి బ్రాండ్ ప్రమోషన్ కూడా చేస్తోంది. డబ్బుల విషయంలో చాన్నాళ్ల నుంచి ఇద్దరు వ్యక్తులు వేధిస్తున్నట్లు ఆమె తండ్రి చెప్పాడు. అయితే వారే ఈ హత్యకు పాల్పడి ఉంటారని ఆమె తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు.