న్యూఢిల్లీ: టిక్‌టాక్ స్టార్ కైల్ మారిసా రోత్(TikTok Star Kyle) మృతిచెందారు. ఆమె వయసు 36 ఏళ్లు. ఆమె తల్లి జాక్వీ కోహెన్ రోత్ తన లింక్డిన్ పోస్టులో ఈ విషయాన్ని తెలిపారు. కైల్ సోదరి లిండ్సే రోత్ తన ఇన్‌స్టా పోస్టులో కూడీ ఈ విషయాన్ని చెప్పింది. తమకు జరిగిన నష్టం నుంచి కోలుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. గత వారం తన సోదరి మృతిచెందినట్లు ఆమె చెప్పారు. ఏ కారణం చేత ఆమె మరణించారో తెలియదు. హ్యూమర్, ఇంటెలిజెన్స్, బ్యూటీతో ఆమె ఎంతో మందిని ఆకట్టుకున్నదని లిండ్సే రోత్ తెలిపారు.