వాంటా: ఫిన్‌ల్యాండ్(Finland)లో కాల్పులు ఘటన జరిగింది. వాంటా సిటీలో ఉన్న ఓ స్కూల్ వద్ద షూటింగ్ జరిగింది. ఆ కాల్పుల్లో ముగ్గురు చిన్నారులు గాయపడ్డారు. విర్టోలా స్కూల్ వద్ద జరిగిన ఘటన పట్ల పోలీసులు స్పందించారు. స్థానికులు ఇండ్లకే పరిమితం కావాలని అధికారులు ఆదేశించారు. ఓ అనుమానితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఆ స్కూల్లో 800 మంది విద్యార్థులు ఉన్నారు. 90 మంది సిబ్బంది కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మైనర్లు ఈ ఘటనలో చిక్కుకున్నారని, దాంట్లో ముగ్గురు చిన్నారులు గాయపడినట్లు చెప్పారు. విర్టోలా స్కూల్లో ఏడు నుంచి 15 ఏళ్ల మధ్య ఉన్న విద్యార్థులు చదువుకుంటారు.