New Year 2024 | కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికేందుకు అంతా సిద్దమవుతున్నారు. మరికొద్ది గంటల్లో న్యూఇయర్ వస్తుండటంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు రకరకాల ప్లాన్స్ చేసుకుంటున్నారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి ఎప్పుడు అవుతుందా? హ్యాపీ న్యూఇయర్ అని ఎప్పుడెప్పుడు చెప్పుకుంటామా? అని ఎదురుచూస్తున్నారు. కానీ కొన్ని దేశాల్లో ఇప్పటికే కొత్త సంవత్సరం మొదలైపోయింది. పసిఫిక్ సముద్రంలోని కిరిబాటి దీవి ప్రజలు అందరికంటే ముందుగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. భారతీయ కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకే వాళ్లకు న్యూఇయర్ మొదలైంది. కిరిబాటి దీవి తర్వాత న్యూజిలాండ్ కూడా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. భారతీయ కాలమాన ప్రకారం 4.30 గంటలకు వాళ్లకు కొత్త సంవత్సరం మొదలయ్యింది. అద్భుతమైన ఫైర్వర్క్స్, హోరెత్తించే మ్యూజిక్‌తో ఆక్లాండ్ ప్రజలు న్యూఇయర్‌కు వెల్కమ్ చెప్పారు.
సాయంత్రం 6.30 గంటలకు.. ఆస్ట్రేలియాలో
రాత్రి 8.30 గంటలకు.. జపాన్, ఉత్తర, దక్షిణ కొరియాలో
రాత్రి 9.30 గంటలకు.. చైనా, మలేసియా, సింగపూర్, హాంకాంగ్, ఫిలిప్పీన్స్‌లో
రాత్రి 10.30 గంటలకు.. థాయిలాండ్, వియత్నాం, కాంబోడియా