Israel-Hamas War | పెండ్లయిన పదేండ్లకు పుట్టిన పండంటి కవలలను యుద్ధం బలితీసుకున్నది. ముద్దులొలికే ఆ చంటిబిడ్డల ఉసురు తీసింది. అమ్మ ఒడి తప్ప మరో ప్రపంచం తెలియని ఆ చిన్నారులు బాంబులకు బలైపోయారు. రక్తపుటేరులో బిడ్డలను, భర్తను చూసిన ఆ మహిళ హృదయం తల్లడిల్లింది.
దక్షిణ గాజా స్ట్రిప్‌లోని రఫాలో ఆదివారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఒకే కుటుంబానికి చెందిన కవల పిల్లలతో పాటు తండ్రి మరణించాడు. వీరి మృతదేహాలను పట్టుకొని మహిళ రోదించడం స్థానికులను కంటతడి పెట్టించింది.