న్యూయార్క్ : సెర్చ్ ఇంజిన్ దిగ్గజం మరో కొత్త ఫీచర్‌ను ఆవిష్కరించింది. జనరేటివ్ ఆర్టిఫిషియల్ (ఏఐ) ఆధారిత సెర్చ్ టూల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఏదైనా అంశం గురించి సెర్చ్ చేస్తే స్థానిక భాషల్లో ఫలితాలు వచ్చేలా రూపొందించారు.
ఈ మేరకు గూగుల్ బ్లాగ్‌పోస్ట్‌లో వెల్లడించింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వివిధ అంశాలను యూజర్లు సులువుగా అర్థం చేసుకుంటారని తెలిపింది. యూజర్ల సందేహాలను ఏఐ టూల్ తీరుస్తుందని పేర్కొంది. అయితే ఇది భారత్, జపాన్‌లో మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉంది.