క్యూబెక్: భూమి ఊపిరి పీలుస్తుందా. ఈ వీడియోను చూస్తే మీరు అలాగే అనుకుంటారు. గాలి పీలుస్తున్నప్పుడు ఊపిరితిత్తుల్లో సంకోచ, వ్యాకోచాలు ఎలా ఉంటాయో.. అలాగే ఈ వీడియోలో ఓ అడవి ఊపీరి పీలుస్తున్నట్టే ఉంది. భూమి పొర పైకి లేస్తూ, కిందకు పడుతూ ఉంటే.. అది శ్వాస పీల్చినట్లుగానే ఉంది. కెనడాలోని క్యూబెక్ రాష్ట్రంలో ఉన్న ఓ అడవిలో ఓ సీన్ ఇలా కనిపించింది. చాలా ఏళ్ల క్రితమే ఈ సీన్.. వీడియోకు చిక్కినా.. ఇప్పుడు మళ్లీ ఆ వీడియో వైరల్ అవుతున్నది. వాస్తవానికి కెనడా అడవిలో చోటుచేసుకున్న పరిణామాలను ఒకసారి పరిశీలిస్తే, ప్రకృతి ఎంత పవర్ఫుల్గా ఉంటుందో అర్థం అవుతుంది.
బలంగా వీస్తున్న గాలులకు అక్కడ ఉన్న చెట్లు ఊగిపోతున్నాయి. అయితే ఆ వృక్షాలు ఊగిపోతున్న తీరుకు భూమి కూడా కిందకుపైకి లేస్తూ కనిపిస్తుంది. చెట్లకు ఉన్న వేరులు.. తీవ్ర గాలులకు లాగేయడం వల్ల ఇలాంటి ఎఫెక్ట్ కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. క్యూబెక్ వీడియోను చూస్తే, నిజంగా భూమి డీప్ బ్రీతింగ్ తీసుకుంటున్నట్లే ఉంటుంది. ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్ సినిమా స్వీకెల్స్ చూసిన వాళ్లకు ఈ థ్రిల్లింగ్ సీన్ ఈజీగా గుర్తుకు వస్తుంది.