Colombia | అడవిలో కూలిన విమానం.. 16 రోజుల పాటు ఆకులు, అలములు తింటూ జీవనం సాగించిన కొలంబియా పిల్లలు
విమానం కూలిపోవడంతో అడవిలో తప్పిపోయిన చిన్నారులు పండ్లు, ఆకులు, అలములు తింటూ తమ ప్రాణాలను నిలబెట్టుకున్నారు. విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ వారిని అడవిలో ఆకలి రూపంలో మరో మృత్యువు కబళించాలని చూసింది.
- ఆకులు, అలములు తింటూ జీవనం
- 16 రోజుల పాటు పోరాటం
- కొలంబియా పిల్లల ఆచూకీ లభ్యం
Colombia | బొగొట, మే 18: విమానం కూలిపోవడంతో అడవిలో తప్పిపోయిన చిన్నారులు పండ్లు, ఆకులు, అలములు తింటూ తమ ప్రాణాలను నిలబెట్టుకున్నారు. విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ వారిని అడవిలో ఆకలి రూపంలో మరో మృత్యువు కబళించాలని చూసింది. అయినా అభంశుభం తెలియని ఆ చిన్నారులు బెదరలేదు.. తమతో పాటు తోబుట్టువు 11 నెలల పసికందు ప్రాణాలను కాపాడారు. క్రూర మృగాల మధ్య ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 16 రోజుల పాటు బతికి చివరికి ప్రాణాలతో అడవి నుంచి బయటపడ్డారు. ఇండిజీనస్ తెగకు చెందిన ఆ చిన్నారులకు అడవులపై కనీస పరిజ్ఞానం ఉండటంతో వారు మృత్యువును జయించారు.
దుమర్ ప్రాంతలో చిన్నారుల ఆచూకీ లభించినట్టు ఆ దేశ అధ్యక్షుడు గుస్తావో పెట్రో తెలిపారు. మే 1న కొలంబియాలోని గౌవియారే ప్రాంతంలో విమానం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు చనిపోగా ఇండిజీనస్ తెగకు చెందిన సోదరులు 13, 9, 4 ఏండ్ల చిన్నారులతో పాటు 11 నెలల పసికందు కూడా ప్రాణాలతో బయటపడింది. అనంతరం వారంతా అడవిలో తప్పిపోయారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారుల నాయనమ్మ గొంతుతో ఇండిజీనస్ తెగ భాషలో ఆడియో రికార్డులను అడవిలో వినిపించారు. అయినా ఫలితం దక్కలేదు. చిన్నారుల వస్తువులు, వారు తిని పడేసిన పండ్లను శునకాలు గుర్తించాయి. దుమర్ ప్రాంతంలో స్థానికులు చిన్నారులను గుర్తించి రేడియో ద్వారా అధికారులకు చిన్నారుల సమాచారాన్ని చేరవేశారు. పడవలో కచిపోర్రోకు చేర్చి వారిని అధికారులకు అప్పగించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- alum
- Children
- eating fruits
- forest
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

