Wild fire | టెక్సాస్ను కమ్మేసిన కార్చిచ్చు.. 60 కౌంటీల్లో విపత్తుగా ప్రకటన
Wild fire | అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని కార్చిచ్చు కమ్మేసింది. సోమవారం మధ్యాహ్నం మొదలైన ఈ కార్చిచ్చుకు ఎండిపోయిన గడ్డి, గాలి తోడు కావడంతో చూస్తుండగానే మంటలు రెట్టింపయ్యాయి. ఈ కార్చిచ్చు కారణంగా అక్కడి ప్రభుత్వం పరిసరాల్లోని చాలా చిన్నచిన్న గ్రామాలను ఖాళీ చేయించింది. ఆ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబాట్ పరిస్థితిని సమీక్షించి 60 కౌంటీల్లో విపత్తుగా ప్రకటించారు.
Wild fire: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని కార్చిచ్చు కమ్మేసింది. సోమవారం మధ్యాహ్నం మొదలైన ఈ కార్చిచ్చుకు ఎండిపోయిన గడ్డి, గాలి తోడు కావడంతో చూస్తుండగానే మంటలు రెట్టింపయ్యాయి. ఈ కార్చిచ్చు కారణంగా అక్కడి ప్రభుత్వం పరిసరాల్లోని చాలా చిన్నచిన్న గ్రామాలను ఖాళీ చేయించింది. ఆ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబాట్ పరిస్థితిని సమీక్షించి 60 కౌంటీల్లో విపత్తుగా ప్రకటించారు.
దాదాపు 780 కిలోమీటర్ల పరిధిలోని 2,00,000 ఎకరాల్లో ఉన్న వృక్షాలను ఈ అగ్నికీలలు దహించివేశాయి. టెక్సాస్ ఏ అండ్ ఎం ఫారెస్ట్ సర్వీస్ ఈ కార్చిచ్చుకు కారణాలను మాత్రం వెల్లడించలేదు. రాష్ట్ర ఉత్తర భాగంలోని ఇరుగ్గా ఉండే ప్రాంతంలో ఈ అగ్ని వ్యాపించడంతో తీవ్రత కూడా ఎక్కువగానే ఉంది. రాష్ట్ర ప్రజలు తమ కార్యక్రమాలను తగ్గించుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని, ఆత్మీయులను రక్షించుకోవాలని గవర్నర్ అబాట్ సూచించారు.
వేర్వేరు ప్రాంతాల్లో మంటలు అంటుకున్నట్లు తమకు సమాచారం వచ్చిందని అధికారులు తెలిపారు. హెంప్హిల్, రాబర్ట్స్ కౌంటీ, కెనెడియన్ టౌన్ నివాస ప్రాంతాల్లోకి కూడా మంటలు వ్యాపించాయి. అమెరికాలో దాదాపు 11 మిలియన్ల మంది కార్చిచ్చు ముప్పునకు సమీపంలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జాతీయ రహదారుల పక్కన కూడా అగ్నికీలలు ఎగసి పడుతుండటంతో వాటిని మూసివేశారు.
టెక్సాస్ నుంచి ఈ మంటలు ఓక్లాహామాకు పాకాయి. అక్కడ రెండు కౌంటీల్లో ఉంటున్న ప్రజలను ఇళ్లు ఖాళీ చేయాలని ప్రభుత్వం హెచ్చరించింది. రోజర్ మిల్స్, ఎల్లిస్ కౌంటీల్లోని ప్రజలను తరలిస్తున్నామని రాష్ట్ర ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ సిబ్బంది పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Telugu News
- Texas
- USA
- wild fire
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

